David Warner: ఎక్కడ మొదలెట్టానో.. అక్కడికే వచ్చాను: వార్నర్‌

సన్‌రైజర్స్‌ హైదరాబాద్ మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఎక్కడ మొదలెట్టానో అక్కడికే వచ్చానని అంటున్నాడు. తాజాగా ఐపీఎల్‌ మెగా వేలంలో అతడిని దిల్లీ క్యాపిటల్స్‌ రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

Published : 14 Feb 2022 17:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్ మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఎక్కడ మొదలెట్టానో అక్కడికే వచ్చానని అంటున్నాడు.తాజాగా ఐపీఎల్‌ మెగా వేలంలో అతడిని దిల్లీ క్యాపిటల్స్‌ రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వార్నర్‌ ఇన్‌స్టాలో ఓ పోస్టు చేసి ఐపీఎల్‌లో తన అరంగేట్రం రోజుల్ని గుర్తుచేసుకున్నాడు. ఈ ఆస్ట్రేలియా ఓపెనర్‌ 2009 నుంచి 2013 వరకు నాటి దిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టులో ఆడాడు. ఆపై 2014 నుంచి గతేడాది వరకు సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ నేపథ్యంలోనే వార్నర్‌ పోస్టు చేస్తూ రాబోయే సీజన్‌లో కొత్త జట్టు సభ్యులను, కొత్త యాజమాన్యాన్ని, కొత్త స్టాఫ్‌ను కలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పాడు. అలాగే దిల్లీ అభిమానులకు మళ్లీ చేరువవ్వడం కూడా ఆనందంగా ఉందన్నాడు. ఈ సందర్భంగా వార్నర్‌ కొత్త అభిమానులను ఒక కోరిక కోరాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేయడానికి పలు సూచనలు కూడా చేయాలని అడిగాడు. కాగా, వార్నర్‌ ఐపీఎల్‌ టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఐదో స్థానంలో ఉన్నాడు. అయితే, గతేడాది అతడు సరిగ్గా ఆడలేని పరిస్థితుల్లో తొలుత కెప్టెన్సీ నుంచి ఆపై తుది జట్టు నుంచి తొలగించారు. ఈ క్రమంలోనే మెగా వేలానికి ముందు వదిలేయడంతో ఈ ఆసీస్‌ ఓపెనర్‌ వేలంలో అడుగుపెట్టాడు. కాగాఅనుకున్నంత ధర దక్కకపోయినా ఈ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ సంతోషంగా ఉండటం గమనార్హం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని