Neeraj Chopra : ‘బంగారు’ నీరజ్‌ చోప్రా అరుదైన ఘనత

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకంతో భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన...

Updated : 10 Aug 2022 10:49 IST

ఇంటర్నెట్ డెస్క్: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకంతో భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన నీరజ్‌ చోప్రా మరో అరుదైన ఘనతను సాధించాడు. ప్రతిష్ఠాత్మకమైన లారస్‌ ‘వరల్డ్‌ బ్రేక్‌త్రూ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు నామినేట్‌ అయ్యాడు. ఈ మేరకు లారస్‌ అకాడమీ వెల్లడించింది. టెన్నిస్‌ స్టార్లు డానీ మెద్వెదెవ్, ఎమ్మా రడుకానుతోపాటు నీరజ్‌ చోప్రా జాబితాలో చోటు సంపాదించాడు. గతేడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఈవెంట్‌లో గోల్డ్‌ గెలిచిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారి భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అలానే లారస్‌కు నామినేట్‌ అయిన మూడో భారతీయుడు నీరజ్‌ చోప్రా. అంతకుముందు దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌, రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ నామినేట్‌ అయినవారిలో ఉన్నారు. 

‘‘టోక్యో ఒలింపిక్స్‌లో నేను సాధించిన ఘనతకు క్రీడా ప్రపంచం గుర్తించడం ఎంతో గౌరవంగా ఉంది. గ్రామీణ భారతం నుంచి వచ్చి ఫిట్‌గా ఉండటం కోసం ఆటలను ఎంచుకున్న ఓ చిన్న కుర్రాడు ఒలింపిక్స్ పోడియం ఎక్కుతాడని ఊహించలేదు. ఇప్పటి వరకు సాగిన ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం, పతకం గెలవడం ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది. ఇప్పుడు లారస్‌ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ గొప్ప క్రీడాకారులతో పరిగణనలోకి తీసుకోవడం చాలా బాగుంది’’ అంటూ లారస్ అకాడమీకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో నీరజ్‌ చోప్రా పేర్కొన్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని