Neeraj chopra: ఇది కొత్త అనుభూతి :నీరజ్‌ చోప్రా

దిల్లీలోని ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులు పాల్గొన్నారు.

Updated : 15 Aug 2021 11:52 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన 75వ స్వాతంత్ర్య వేడుకల్లో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులు పాల్గొన్నారు. జావెలిన్‌ త్రోలో బంగారు పతకం సాధించిన నీరజ్‌ చోప్రా, వెయిట్‌ లిప్టింగ్‌లో రజతం సాధించిన మీరాబాయి, బ్యాడ్మింటన్‌లో కాంస్యం అందుకున్న పీవీ సింధుతోపాటు ఒలింపిక్స్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన 32మంది ఈ వేడుకలకు హాజరయ్యారు. వీరితోపాటు ఇద్దరు (స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్ ఇండియా) సాయ్‌ అధికారులు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నీరజ్‌ చోప్రా మాట్లాడుతూ.. ‘ఇంతకుముందు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను టీవీలో చూసేవాణ్ని. ఇప్పుడు ఆ వేడుకలకు ప్రత్యక్షంగా హాజరయ్యా. ఇది నాకు కొత్త అనుభూతి. విశ్వ క్రీడల్లో వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం మన దేశం చాలా ఏళ్లుగా  సాధించలేదు. నా వల్ల దేశం గర్వపడే విధంగా పతకం వచ్చినందుకు సంతోషంగా ఉంది’ అని అన్నాడు.

ఇక, ఇటీవల ముగిసిన ఒలింపిక్స్‌లో భారత్‌ ఏడు పతకాలు సాధించింది. ఇందులో ఒక స్వర్ణం, రెండు రజత, నాలుగు క్యాంస పతకాలున్నాయి. భారత్‌కు ఒలింపిక్స్‌లో ఇన్ని పతకాలు రావడం ఇదే తొలిసారి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని