
Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్‌కి నా కోచ్ ఎవరంటే..!
ఇంటర్నెట్ డెస్క్: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం సాధించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు భారతీయ జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్‌చోప్రా. శుక్రవారం మీడియాకు ఇచ్చిన ఇంటర్య్యూలో రాబోయే పారిస్ ఒలింపిక్స్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. మరో మూడేళ్లలో జరగబోయే పారిస్ ఒలింపిక్స్ 2024కి శిక్షణనంతా డాకర్.క్లాస్ బార్టోనియెట్జ్ ఆధ్వర్యంలోనే ఉంటుందని స్పష్టం చేశాడు. అందుకు గల ప్రత్యేక కారణాలను ఇలా వివరిస్తూ.. ‘‘టోక్యో ఒలింపిక్స్‌కీ నాకు క్లాస్ బార్టోనియెట్జ్ కోచ్‌గా వ్యవహరించారు. ఆయనతో నాకు గొప్ప అనుబంధం ఉంది. ఆయనిచ్చే శిక్షణా పద్ధతులు నాకు సూట్ అవుతాయి. అందుకే రాబోయే పారిస్ ఒలింపిక్స్‌కి ఆయనే నా కోచ్‌గా కొనసాగుతారు. ఇక మా కోచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే.. సీరియస్ సెషన్స్‌లో కూడా ఆయన జోక్స్ వేస్తుంటారు. నాకు కూడా ట్రైనింగ్ సమయంలో సీరియస్‌గా ఉండటం నచ్చదు. సాధారణంగా శిక్షణా సమయంలో కొంత మంది కోచ్‌లు బెత్తం పట్టుకొని కూర్చుంటారు (నవ్వుతూ), కానీ నా గురు అలా కాదు’’ అన్నారు
నీరజ్ చోప్రా కోచ్ డా. క్లాస్ బార్టోనియెట్జ్
ఆరోజు ఏం జరిగిందంటే..
టోక్యో ఒలింపిక్స్‌లో తుదిదశ పోరుకి కొద్ది సమయం ఉందనగా... ఫైనల్‌కు చేరుకున్న చాలా మంది వార్మప్ త్రో చేశారు కానీ నేను మాత్రం రెండు మూడు వార్మప్‌తోనే సరిపెట్టుకున్నా. ఎందుకంటే ఇక్కడి వార్మప్‌కే ఉన్న శక్తినంతా కేటాయిస్తే.. అసలాఖరు మ్యాచ్‌కి నీ దగ్గర ఎనర్జీ ఉండదని నా కోచ్ చెప్పారు. ఆయన చెప్పినట్లే పోటీ సమయానికి శక్తిని వృథా చేయకుండా.. ఏమాత్రం ఒత్తిడికి గురవ్వకుండా ది బెస్ట్ ఇచ్చా. నేను స్వర్ణం సాధించేందుకు ఈ అంశం కూడా బాగా ఉపయోగపడిందనే చెప్పాలి అని ఒలింపిక్స్‌రోజున జరిగిన విషయాన్ని పంచుకున్నాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.