Updated : 07 Aug 2021 19:22 IST

Tokyo olympics: నీరజ్‌ చోప్రా.. నీది అద్వితీయమైన విజయం

ట్విటర్‌లో వెల్లువెత్తున్న ప్రముఖల ప్రశంసలు

ఇంటర్నెట్‌డెస్క్‌: టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రోలో స్వర్ణ పతకాన్ని దేశానికి అందించిన నీరజ్‌ చోప్రాకు ప్రముఖులు ప్రశంసలు తెలియజేస్తున్నారు. స్వత్రంత్ర భారత దేశంలో అథ్లెటిక్స్‌ విభాగంలో తొలి వ్యక్తిగత స్వర్ణం సాధించిన నీరజ్‌కు అభినందనలు చెబుతున్నారు. 2008లో షూటింగ్‌లో అభినవ్‌ బింద్రా తర్వాత పసిడి పతకం సాధించిన వీరుడిగానూ నీరజ్‌ కొత్త చరిత్ర సృష్టించాడు.

* నీరజ్‌ చోప్రా.. ఇది అద్వితీయమైన గెలుపు. స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించావు. తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొని భారత్‌కు పసిడి పతకం తీసుకొచ్చిన నీ ప్రతిభ.. ఎంతో మంది యువతకు స్ఫూర్తిదాయకం. భారతదేశం.. నీ విజయానికి సంతోషిస్తోంది. హృదయపూర్వక అభినందనలు - రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కొవింద్‌

* టోక్యో ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించారు. ఈరోజు నీరజ్ చోప్రా స్వర్ణం గెలవడం చిరకాలం గుర్తుంటుంది. చాలా చక్కగా రాణించాడు. ఒక ప్యాషన్‌తో తనదైన శైలిలో ఆడిన నీరజ్‌కు నా అభినందనలు - ప్రధాని నరేంద్ర మోదీ

* టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రో విభాగంలో స్వర్ణం సాధించి తన గెలుపుతో నీరజ్‌ చోప్రా చరిత్ర సృష్టించాడు.ఇది గొప్ప విజయం. ఇన్నాళ్లు భారతీయులు వేచి చూస్తున్న స్వర్ణ పతక నిరీక్షణకు తెరపడింది. - ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు

* స్వర్ణం సాధించాలన్న దేశ ప్రజల కోరికను నువ్వు సాధించావ్‌ నీరజ్‌ చోప్రా. నీ విజయానికి నేను వంగి నమస్కరిస్తున్నా. పసిడి పతకాన్ని దేశానికి అందించినందుకు ధన్యవాదాలు. అలాగే గోల్డ్‌ క్లబ్‌కు వెల్‌కమ్‌. ఇలాంటి పతకాలు మరెన్నో తీసుకురావాలి. చాలా సంతోషంగా, గర్వంగానూ ఉంది - అథ్లెట్‌, ఒలింపిక్ స్వర్ణ విజేత అభినవ్‌ బింద్రా

* జావెలిన్‌ త్రో.. పురుషుల విభాగంలో తొలి స్వర్ణ పతాకం సాధించిన నీరజ్‌ చోప్రాకు నా అభినందనలు. ఎన్నోరోజులుగా వేచి చూస్తున్న కల నిజమైన రోజు. నువ్వు చరిత్ర సృష్టించావు‌. ఈరోజు నీ విజయంతో కోట్లాది భారతీయుల్లో స్ఫూర్తి నింపావు  - తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌

జావెలిన్‌ త్రో పురుషుల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన నీరజ్‌ చోప్రాకు కంగ్రాట్స్‌. భారతదేశం నిన్ను చూసి గర్విస్తుంది. - తెలంగాణ మంత్రి కేటీఆర్‌

భారతదేశ చరిత్రలో చరిత్రాత్మక దినమిది.. అథ్లెటిక్స్‌ 100ఏళ్ల చరిత్రలో స్వర్ణ పతకం గెలుచుకున్నందుకు నా అభినందనలు - కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి

భారత్‌కు ఒలింపిక్స్‌ వ్యక్తిగత విభాగంలో అభినవ్ బింద్రా తర్వాత స్వర్ణం అందించిన రెండో క్రీడాకారుడిగా నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించడం హర్షణీయం. ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రా భారత మువ్వన్నెల పతకానికి పసిడి కాంతులద్ది దేశ ప్రజలంతా గర్వించేలా చేశాడు.  - బండి సంజయ్‌

130 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో స్వర్ణ పథకం గెలవలేకపోయామనే వెలితిని చోప్రా తీర్చాడు. జావెలిన్ త్రో ఆటలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించి స్వర్ణ పథకాన్ని సాధించి అందరి మనసులను నీరజ్ గెలుచుకున్నాడు. - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నీరజ్ చోప్రా.. నీ గెలుపుతో ఎనలేని సంతోషం కలిగించావు. స్వర్ణ పతకం గెలిచిన నిన్ను చూసి యావత్ భారతావని గర్విస్తోంది. - ఏపీ సీఎం జగన్‌

టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించారు. భవిష్యత్తు ఆటగాళ్లకు చోప్రా స్ఫూర్తిగా నిలిచారు. నీరజ్ ప్రతిభ చూసి భారతదేశం గర్వపడుతోంది. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు, పథకాలు సాధించి దేశం మరింత గర్వించేలా చేయాలి. -చంద్రబాబుRead latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని