Neeraj Chopra: నటుడిగా మారిన నీరజ్‌ చోప్రా

టోక్యో ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌లో స్వర్ణం సాధించిన నీరజ్‌ చోప్రా క్రెడ్‌ యాడ్‌లో నటించి నెటిజన్ల మనుసులు దోచుకుంటున్నాడు

Updated : 18 Aug 2022 16:09 IST

‘క్రెడ్‌’ యాడ్‌లో అయిదు అవతారాల్లో సందడి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇన్ని రోజులు నీరజ్‌ చోప్రా అంటే టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం సాధించిన అథ్లెట్‌గానే పరిచయం. కానీ అతడిలో దాగి ఉన్న నటుడి గురించి మీకు తెలుసా. తాజాగా నీరజ్‌ ‘క్రెడ్‌’ అనే క్రెడిట్‌ కార్డ్‌ ప్లాట్‌ఫామ్‌ ఫీచర్‌ యాడ్‌లో నటించి చక్కటి యాక్టింగ్‌ స్కిల్స్‌తో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఈ యాడ్‌లో జర్నలిస్టుగా, క్యాషియర్‌గా, మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా, ఫిల్మ్‌మేకర్‌, జావెలిన్‌ త్రోయర్‌ కావలనుకుంటున్న వ్యక్తిగా కనిపించాడు ఈ యూత్‌ ఐకాన్‌. ఒక్కోదాంట్లో ఒక్కోరకంగా తన నటనను ప్రదర్శించి నవ్వులు కురిపించాడు. ఈ ఏడాది ‘క్రెడ్‌’ సంస్థకి ప్రచారకర్తగా వ్యవహరించిన భారత మాజీ క్రికెటర్‌ రాహుల్ ద్రవిడ్‌ బెంగళూరు ట్రాఫిక్‌లో చిక్కుకున్న వ్యక్తిగా కంట్రోల్‌ తప్పి కోపంగా కనిపించే పాత్రలో అద్భుతంగా కనిపించాడు. ఇక బాలీవుడ్‌ నటుడు జాకీ ష్రాఫ్‌ జుంబా ఇన్‌స్ర్టక్టర్‌గా క్రెడ్‌యాడ్‌లో కనిపించాడు. వీరిద్దరిని కేవలం ఒక్క గెటప్‌లోనే చూపించగా... నీరజ్‌ని మాత్రం అయిదు అవతారాల్లో చూపించే ప్రయత్నం చేసింది. కాగా నీరజ్‌ ‘‘360 డిగ్రీ మార్కెటింగ్‌’’ అని క్రెడిట్‌ క్లబ్‌ని ట్యాగ్‌ చేసి ట్విటర్‌ వేదికగా ఈ  వీడియోని పంచుకున్నాడు నీరజ్‌. షేర్‌ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఇది వైరల్‌ అయింది. ఇప్పటికే ట్విటర్‌లో రెండు మిలియన్ల వ్యూస్‌ని దక్కించుకొని ముందుకు దూసుకెళ్తోంది. తనలో కొత్తకోణాన్ని చూపించిన ఈ యూత్‌ ఐకాన్‌ను నెటిజన్లే కాదు సెలబ్రెటీలు అభినందిస్తున్నారు. ‘‘ప్రజలంతా నీ బయోపిక్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ ప్రకటనతో నువ్వు యాక్టింగ్‌లోకి ప్రవేశించావు’’ అని బాలీవుడ్‌ నటుడు సిద్ధార్థ్‌ మల్హోత్రా ట్వీట్‌ చేశారు. నీరజ్‌ యాక్టింగ్ గురించి మాజీ భారత ఆటగాడు, డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా ట్వీట్‌ చేశాడు. ‘‘నీ యాక్టింగ్‌ చాలా బాగుంది.. నీ బయోపిక్‌లో నువ్వే నటించాలి, బాలీవుడ్‌ స్టార్ల వారసులకు పోటీ ఇచ్చే మొనగాడు వచ్చాడ్రోయ్‌!’’ అంటూ నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 

 




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని