Cricket : ఔట్ చేసే అవకాశమున్నా వదిలేశాడు.!

ఒమన్‌లో జరుగుతున్న ఒమన్‌ క్వాడ్రాంగులర్‌ టీ20 సిరీస్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రత్యర్థి జట్టు ఆటగాడిని ఔట్ చేసే అవకాశమున్న వదలేసి క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు ఓ వికెట్‌..

Published : 15 Feb 2022 16:39 IST

* క్రీడాస్ఫూర్తి చాటుకున్న నేపాల్ వికెట్‌ కీపర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఒమన్‌లో జరుగుతున్న ఒమన్‌ క్వాడ్రాంగులర్‌ టీ20 సిరీస్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రత్యర్థి జట్టు ఆటగాడిని ఔట్ చేసే అవకాశమున్న వదలేసి క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు ఓ వికెట్‌ కీపర్‌. ఇంతకు ఏం జరిగిందంటే..

నేపాల్ బౌలర్‌ కమల్ వేసిన 19వ ఓవర్‌ రెండో బంతికి ఐర్లాండ్‌ ఆటగాడు మెక్‌ బ్రైక్‌ సింగిల్‌ తీసే క్రమంలో బౌలర్ కాలు తగిలి కిందపడిపోయాడు. అతడు లేచి మళ్లీ పరుగు తీసేసరికి.. బంతిని అందుకున్న కమల్ నేరుగా‌ వికెట్‌ కీపర్‌ అసిఫ్‌ షేక్‌కి విసిరాడు. బంతి అసిఫ్‌ చేతికి చిక్కినా‌.. మెక్‌ బ్రైన్‌ను ఔట్ చేయకుండా క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు. ఈ ఘటనపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తూ.. అసిఫ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కామెంటేటర్లు కూడా అసిఫ్‌ను ప్రశంసించారు. ‘ఈ ఘటనను చూశాక రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ప్రత్యర్థి ఆటగాడిని ఔట్ చేసే అవకాశమున్న వదిలేసి.. అసిఫ్‌ షేక్‌ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు. ఇతడిని ‘ఐసీసీ స్పిరిట్‌ ఆఫ్ క్రికెట్‌ అవార్డు-2022’కు నామినేట్‌ చేస్తున్నాను’ అని ఓ కామెంటేటర్‌ వ్యాఖ్యానించాడు.

ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన నేపాల్ 111 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఐర్లాండ్‌ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచులో చోటు చేసుకున్న ఆసక్తికర ఘటనను మీరూ చూసేయండి.!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని