Ruturaj Gaikwad: రుతురాజ్‌ తీరుపై నెటిజన్ల ఆగ్రహం.. ఎందుకో తెలుసా?

టీమ్‌ఇండియా యువ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతరాత్రి బెంగళూరు వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అతడు వ్యవహరించిన తీరే అందుకు కారణం...

Published : 21 Jun 2022 01:44 IST

(Photo: Ruturaj Gaikwad Instagram)

బెంగళూరు: టీమ్‌ఇండియా యువ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతరాత్రి బెంగళూరు వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అతడు వ్యవహరించిన తీరే అందుకు కారణం. వర్షం కారణంగా రద్దయిన ఈ పోరులో గైక్వాడ్.. మైదాన సిబ్బంది ఒకరితో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. చిన్నస్వామి స్టేడియంలోనూ టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 3.3 ఓవర్లలో 28/2తో నిలిచింది. ఆ సమయంలోనే వర్షం కురవడంతో ఆటను నిలిపివేశారు. తర్వాత వర్షం తగ్గకపోయేసరికి అంపైర్లు రద్దు చేశారు. అయితే, మధ్యలో రుతురాజ్‌ డగౌట్‌లో కూర్చున్న సమయంలో..  మైదాన సిబ్బంది ఒకరు అతడి వద్దకెళ్లి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు. అయితే.. గైక్వాడ్‌ అతడిని కాస్త దూరంగా ఉండాలని సైగలు చేస్తూ అసహనం వ్యక్తం చేసినట్లు టీవీలో కనిపించింది. దీంతో అది చూసిన క్రికెట్‌ ప్రేమికులు టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ తీరును తప్పుబడుతున్నారు. గైక్వాడ్‌ ఇలా వ్యవహరించడం ద్వారా ఇతరుల పట్ల వివక్ష చూపుతున్నాడని విమర్శలు చేస్తున్నారు. పలువురు నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియోను పంచుకొని అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని