
Kieron Pollard కాకా వెంటాడి మరీ కొట్టాడు: వీరూ
ముంబయి ఇండియన్స్‌పై ప్రశంసల జల్లు
ఇంటర్నెట్ డెస్క్: విజేతల మధ్య పోరులో విజయం సాధించిన ముంబయి ఇండియన్స్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. 219 పరుగుల లక్ష్య ఛేదనలో అజేయంగా నిలిచిన కీరన్ పొలార్డ్ (87*; 34 బంతుల్లో 6×4, 8×6)ను మాజీ క్రికెటర్లు, అభిమానులు అభినందనల్లో ముంచెత్తుతున్నారు. ఇలాంటి అద్భుతమైన ఇన్నింగ్సులు ఆడటం అతడికి మాత్రమే చెల్లుతుందని అంటున్నారు. వీరేంద్ర సెహ్వాగ్, కృష్ణమాచారి శ్రీకాంత్, హర్షభోగ్లే తమదైన శైలిలో ప్రశంసలు కురిపించారు. చెన్నై సూపర్‌కింగ్స్ సైతం చక్కగా పోరాడిందని అంటున్నారు.
నిజం చెప్పాలంటే రెండూ ఛాంపియన్ జట్లే. ఏదేమైనా ఈ మ్యాచ్ చూసేందుకు చాలా బాగుంది. పొలార్డ్ నీకు వందనం. ఎంతైనా ముంబయి గొప్ప జట్టు - డేల్ స్టెయిన్
ఆహా ఏం మ్యాచ్ ఇది !! కీరన్ పొలార్డ్ నువ్వో అద్భుతం !! అంబటి రాయుడిదీ గొప్ప ఇన్నింగ్సే!! - యువరాజ్ సింగ్
తిరుగులేదంతే! ముంబయి పల్టాన్స్‌కు ఇది అలవాటే. కీరన్ పొలార్డ్ సూపర్ - హర్షభోగ్లే
‘పొలి’ కాకా నుంచి ఎలాంటి అద్భుతమైన హిట్టింగ్.. నిజంగా విధ్వంసమే. బంతిని వెంటాడి వెంటాడి మరీ కొట్టాడు - వీరేంద్ర సెహ్వాగ్
వావ్! ఏం జరిగిందో చెప్పేందుకు మాటల్లేవ్! ఇలాంటి మ్యాచ్ చూస్తాననుకోలేదు. కీరన్ పొలార్డ్ అద్భుత ఇన్నింగ్స్. ఐపీఎల్‌లో నేను చూసిన గొప్ప హిట్టింగ్ ఇదే. ముంబయికి కుడోస్. చెన్నై చివరి వరకూ పోరాడింది. ఇదో గొప్ప మ్యాచ్ - కృష్ణమాచారి శ్రీకాంత్
నిజంగా అద్భుతమైన క్రికెట్ ఇది. పొడగరి కీరన్ పొలార్డ్ తనదైన రీతిలో గెలిపించాడు. ముంబయి పల్టాన్స్ వెల్‌డన్. రాయుడూ.. సూపర్ ఇన్నింగ్స్ మచ్చా! సామ్ కరన్ బౌలింగ్ బాగుంది - హర్భజన్ సింగ్