BCCI-CAC: మదన్‌లాల్‌, ఆర్పీ సింగ్‌ ఔట్‌.. క్రికెట్‌ అడ్వైజరీ కమిటీలోకి మల్హోత్రా, పరంజపే

ఇప్పటికే సెలెక్షన్ కమిటీని రద్దు చేసిన బీసీసీఐ తాజాగా క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ (సీఏసీ)లోని ఇద్దరిని తప్పించింది. కొత్తగా మరో ఇద్దరిని నియమిస్తూ నిర్ణయం తీసుకొంది.  

Updated : 01 Dec 2022 20:27 IST

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్‌ జట్టు సెలెక్షన్ కమిటీ ఎంపిక కోసం భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) కీలక చర్యలు తీసుకొంది. ముందుగా క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)లో భారీ మార్పులు చేపట్టింది. ఇంతకుముందు ఉన్న మదన్‌లాల్‌, రుద్రప్రతాప్‌ సింగ్ (ఆర్పీ సింగ్‌) స్థానాల్లో అశోక్‌ మల్హోత్రా, జతిన్‌ పరంజపేలను బీసీసీఐ తీసుకొంది. గత కమిటీలో ఉన్న సులక్షణ నాయక్‌ను కొనసాగించింది. దీంతో మల్హోత్రా, పరంజపే, నాయక్‌ ఆధ్వర్యంలోని సీఏసీ.. క్రికెట్‌ జట్టును ఎంపిక చేసే సెలెక్టర్లను నియమించనుంది. 

‘‘టీమ్‌ఇండియా తరఫున మల్హోత్రా ఏడు టెస్టులు, 20 వన్డేలు ఆడారు. భారత క్రికెటర్ల అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించారు. పరంజపే కూడా నాలుగు వన్డేలు ఆడారు. సీనియర్ జట్టు సెలెక్షన్ కమిటీలో పనిచేసిన అనుభవం ఉంది’’ అని జై షా వెల్లడించారు. ఇప్పటికే చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీని ఇటీవల బీసీసీఐ రద్దు చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని