T20 World Cup: అసహనంతో చేతిని కొట్టుకుని.. ఫైనల్‌కు దూరం

ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగే టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ ముంగిట న్యూజిలాండ్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక బ్యాట్స్‌మన్‌ డెవాన్‌ కాన్వే గాయంతో తుది సమరానికి దూరమయ్యాడు. ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్లో

Updated : 13 Nov 2021 08:55 IST

దుబాయ్‌: ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగే టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ ముంగిట న్యూజిలాండ్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక బ్యాట్స్‌మన్‌ డెవాన్‌ కాన్వే గాయంతో తుది సమరానికి దూరమయ్యాడు. ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్లో 167 పరుగుల ఛేదనలో కాన్వే విలువైన 46 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఔటైన తర్వాత అసహనంతో బ్యాట్‌తో కుడి చేతికి పొరపాటున కొట్టుకోవడంతో గాయమైంది. దీంతో అతడు ఫైనల్‌తో పాటు రాబోయే భారత్‌తో టీ20 సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. ‘‘అనూహ్యంగా అయిన గాయం కారణంగా ఫైనల్‌ ఆడలేకపోవడం కాన్వేను చాలా బాధిస్తోంది. ఈ గాయం అనుకోకుండా జరిగింది. ప్రపంచకప్‌తో పాటు భారత్‌తో టీ20 సిరీస్‌లకు కాన్వేకు ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంపిక చేయలేదు. అయితే టీమ్‌ఇండియా టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉన్న ఆటగాళ్లను పరిశీలిస్తున్నాం’’ అని న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని