T20 World Cup: ఈసారి కప్‌ సాధిస్తాం : టిమ్‌ సౌథీ

వన్డే క్రికెట్లో ఐదు సార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకు.. టీ20 ప్రపంచకప్‌ అందని ద్రాక్షలా ఊరిస్తూనే ఉంది. మరోవైపు ఐసీసీ టోర్నీల్లో గొప్పగా రాణిస్తూ.. టెస్ట్‌ ఛాంపియన్‌గా నిలిచిన..

Published : 13 Nov 2021 16:23 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే క్రికెట్లో ఐదు సార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకు.. టీ20 ప్రపంచకప్‌ అందని ద్రాక్షలా ఊరిస్తూనే ఉంది. మరోవైపు ఐసీసీ టోర్నీల్లో గొప్పగా రాణిస్తూ.. టెస్ట్‌ ఛాంపియన్‌గా నిలిచిన న్యూజిలాండ్‌ జట్టు కూడా ఇప్పటి వరకు పొట్టి ఫార్మాట్లో విజేతగా నిలువలేకపోయింది. దీంతో ఈ సారి టైటిల్ పోరు రసవత్తరంగా ఉండనుంది. ఈ నేపథ్యంలో కివీస్ ఆటగాడు టిమ్‌ సౌథీ ఈసారి ఎలాగైనా కప్‌ సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘ప్రస్తుత, టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో మేం పాకిస్థాన్ చేతిలో ఓటమి పాలయ్యాం. మేం ఏ విభాగాల్లో బలహీనంగా ఉన్నామో గుర్తించి చిన్న చిన్న మార్పులు చేశాం. దాంతో మిగతా మ్యాచుల్లో పై చేయి సాధించగలిగాం. బయటి నుంచి వచ్చే విమర్శలను మేం పట్టించుకోం. మేమంతా సమష్టిగా రాణిస్తూ గొప్ప విజయాలు సాధిస్తున్నాం. పరిస్థితుల్ని అంచనా వేసి.. అందుకు అనుగుణంగా వ్యూహాలు అమలు చేస్తున్నాం. దాంతో ఈ టోర్నీలో ఫైనల్ వరకు రాగలిగాం. మరో వైపు, ఆస్ట్రేలియా కూడా బాగా ఆడుతోంది. ఇంగ్లాండ్ లాగే ఆ జట్టునిండా ప్రమాదకర హిట్టర్లున్నారు. అయితే, ఫైనల్ మ్యాచ్‌లో ఏమైనా జరగొచ్చు’ అని టిమ్‌ సౌథీ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌ టైటిల్ పోరులో భాగంగా ఆదివారం దుబాయ్‌ వేదికగా న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.

Read latest Sports News and Telugu News

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts