WTC Final: రెండో సెషన్‌ పూర్తి.. కివీస్‌ 36/0 

టీమ్‌ఇండియాతో తలపడుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ను సానుకూలంగా ప్రారంభించింది. ఓపెనర్లు టామ్‌ లాథమ్‌(17; 70 బంతుల్లో 1x4), డెవాన్‌ కాన్వే(18; 56 బంతుల్లో 3x4) ఆచితూచి బ్యాటింగ్‌ చేస్తున్నారు...

Updated : 20 Jun 2021 20:51 IST

వికెట్ల కోసం ఎదురు చూస్తున్న భారత్‌..

సౌథాంప్టన్‌: టీమ్‌ఇండియాతో తలపడుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ను సానుకూలంగా ప్రారంభించింది. ఓపెనర్లు టామ్‌ లాథమ్‌(17; 70 బంతుల్లో 1x4), డెవాన్‌ కాన్వే(18; 56 బంతుల్లో 3x4) ఆచితూచి బ్యాటింగ్‌ చేస్తున్నారు. కఠిన పరిస్థితుల్లో భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ వికెట్లు కాపాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా తొలి వికెట్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక తేనీరు విరామ సమయానికి న్యూజిలాండ్‌ 21 ఓవర్లలో 36/0 స్కోర్‌తో కొనసాగుతోంది. ఇషాంత్‌, బుమ్రా, షమి, అశ్విన్‌ పరుగులెక్కువ ఇవ్వకపోయినా వికెట్లు తీయలేకపోతున్నారు. దాంతో మూడో సెషన్‌లోనైనా కివీస్‌ వికెట్లు దక్కాలని ఆశిస్తున్నారు.

అంతకుముందు టాస్‌ఓడి బ్యాటింగ్‌ చేసిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌటైంది. వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె(49; 117 బంతుల్లో 5x4), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(44; 132 బంతుల్లో 1x4) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. ఆదివారం మూడోరోజు ఆట అరగంట ఆలస్యంగా ప్రారంభమవ్వగా భారత్‌ 146/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో బరిలోకి దిగింది. ఈ క్రమంలోనే మరో 71 పరుగులు చేసి మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. కివీస్‌ పేసర్‌ కైల్‌ జేమీసన్‌ ఐదు వికెట్లతో చెలరేగాడు. మరో ఎండ్‌లో ఇతర పేసర్లు సైతం పదునైన బౌలింగ్‌తో భారత బ్యాట్స్‌మెన్‌ను కుదురుకోనివ్వలేదు. దాంతో భారత్‌ 217 పరుగులకే సరిపెట్టుకుంది. జేమీసన్‌ 5/31, నీల్‌ వాగ్నర్‌ 2/40, బౌల్ట్‌ 2/47 మెరుగైన ప్రదర్శన చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని