IND vs NZ: తొలి సెషన్‌లో రెండు వికెట్లు కోల్పోయిన కివీస్‌.!

కాన్పూర్‌ వేదికగా జరగుతుతోన్న మొదటి టెస్టు మూడో రోజు తొలి సెషన్‌లోనూ కివీస్‌ రెండు వికెట్లు కోల్పోయింది. ఓవర్‌ నైట్ బ్యాటర్‌ విల్‌ యంగ్‌ (89) ఔటయ్యాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ వేసిన 67వ

Published : 27 Nov 2021 11:47 IST

ఇంటర్నెట్ డెస్క్‌: కాన్పూర్‌ వేదికగా జరగుతుతోన్న మొదటి టెస్టు మూడో రోజు తొలి సెషన్‌లో కివీస్‌ రెండు వికెట్లు కోల్పోయింది. ఓవర్‌ నైట్ బ్యాటర్‌ విల్‌ యంగ్‌ (89) ఔటయ్యాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ వేసిన 67వ ఓవర్ తొలి బంతికి అతడు కీపర్‌కు చిక్కి పెవిలియన్‌ చేరాడు. దీంతో భారత బౌలర్ల నిరీక్షణకు తెరదించినట్లయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ (18), ఓవర్‌ నైట్ బ్యాటర్ టామ్‌ లేథమ్‌ (82)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే ఉమేశ్ యాదవ్‌ వేసిన 86వ ఓవర్‌ మూడో బంతికి విలియమ్సన్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. 129/0 ఓవర్ నైట్ స్కోర్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్‌ తొలిసెషన్‌ ముగిసే సరికి 197/2 స్కోరుతో నిలిచింది. కివీస్‌ ఇంకా 148 పరుగులు వెనుకబడి ఉంది. భారత బౌలర్లలో అశ్విన్‌, ఉమేశ్ యాదవ్‌ తలో వికెట్‌ తీశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని