NZ vs IND: న్యూజిలాండ్‌, భారత్‌ మధ్య తొలి వన్డే.. గత రికార్డులు ఇలా

న్యూజిలాండ్, భారత్‌ మధ్య మూడు వన్డేల సిరీస్‌కు రంగం సిద్ధమైంది. నవంబర్‌ 25న ఆక్లాండ్ వేదికగా తొలి వన్డే జరగనుంది. మరి ఇప్పటివరకు ఈ రెండు జట్లు మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌ల్లో నమోదైన రికార్డులు, ఈ మ్యాచ్‌లో కొత్తగా ఏ రికార్డులు నమోదయ్యే అవకాశం ఉందో ఓ లుక్కేద్దాం. 

Published : 24 Nov 2022 22:53 IST

ఇంటర్నెట్ డెస్క్‌: న్యూజిలాండ్, భారత్‌ మధ్య మూడు వన్డేల సిరీస్‌కు రంగం సిద్ధమైంది. నవంబర్‌ 25న ఆక్లాండ్ వేదికగా తొలి వన్డే జరగనుంది. మరి ఇప్పటివరకు ఈ రెండు జట్లు మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌ల్లో నమోదైన రికార్డులు, ఈ మ్యాచ్‌లో కొత్తగా ఏ రికార్డులు నమోదయ్యే అవకాశం ఉందో ఓ లుక్కేద్దాం. 

🏏వన్డేల్లో కివీస్‌, టీమ్‌ఇండియా ఇప్పటివరకు 110 సార్లు తలపడ్డాయి. 
55 సార్లు భారత్‌ విజయం సాధించగా.. 49 సార్లు న్యూజిలాండ్ గెలుపొందింది. ఒక మ్యాచ్‌ టైగా.. ఐదు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. 

🏏భారత్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు: సచిన్ (1750)

🏏కివీస్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌: కేన్‌ విలియమ్సన్‌ (984) 

🏏భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌: జవగళ్‌ శ్రీనాథ్‌ (51) 

🏏న్యూజిలాండ్ తరఫున ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌:కైల్‌ మిల్స్‌ (32) 

🏏రిషభ్ పంత్‌ మరో 50 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 4వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు.

🏏కివీస్‌ ఫాస్ట్‌బౌలర్‌ టిమ్‌ సౌథీ ఒక్క వికెట్ పడగొడితే వన్డేల్లో 200 వికెట్ల మైలురాయిని అందుకుంటాడు.

🏏భారత ఆటగాడు శార్దూల్ ఠాకూర్‌ కూడా ఒక్క వికెట్ పడగొడితే అంతర్జాతీయ క్రికెట్‌లో 100 వికెట్లు పూర్తి చేసుకుంటాడు. 

🏏న్యూజిలాండ్ బ్యాటర్‌ డివాన్ కాన్వే మరో తొమ్మిది ఫోర్లు బాదితే వన్డేల్లో 50 ఫోర్లు పూర్తి చేసినట్లవుతుంది

🏏కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మరో 46 పరుగులు చేస్తే స్వదేశంలో ఆడిన వన్డేల్లో 3000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. 

🏏న్యూజిలాండ్ బౌలర్‌ టిమ్‌ సౌథీ మరో ఐదు వికెట్లు పడగొడితే క్రిస్‌ హారిస్‌ (203)ను అధిగమించి వన్డేల్లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలుస్తాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని