T20 World Cup 2021: స్కాట్లాండ్‌పై కివీస్ గెలుపు

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ విజయం సాధించింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్‌ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు..

Updated : 03 Nov 2021 19:09 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దుబాయ్‌ వేదికగా స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ విజయం సాధించింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్‌ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 156 పరుగులు మాత్రమే చేసింది. దీంతో కివీస్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్కాట్లాండ్‌ బ్యాటర్లలో మైఖేల్ లియాస్క్‌ (42) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ఇస్‌ సోదీ రెండేసి, టిమ్‌ సౌథీ ఒక వికెట్ తీశారు.

ఛేదనకు దిగిన స్కాట్లాండ్‌ జట్టుకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ట్రెంట్ బౌల్ట్‌ వేసిన మూడో ఓవర్లో ఓపెనర్‌ కైల్‌ కోట్జర్‌ (17) ఔటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన మాథ్యూ క్రాస్‌ (27)తో కలిసి.. జార్జ్‌ మున్సీ (22) నిలకడగా ఆడుతూ పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలోనే ఇష్‌ సోదీ వేసిన ఎనిమిదో ఓవర్లో క్రీజులో జార్జ్‌ మున్సీ ఔటయ్యాడు. కొద్ది సేపటికే క్రాస్‌ కూడా.. బౌల్డై క్రీజు వీడాడు. దీంతో 11 ఓవర్లకు స్కాట్లాండ్‌ 77 పరుగులతో నిలిచింది. అయితే, ఛేదించాల్సిన లక్ష్యం భారీగా ఉండటంతో ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మ్యాక్‌ లాయిడ్ (17), రిచీ బెర్రింగ్టన్‌ (20) వేగంగా ఆడే క్రమంలో పెవిలియన్‌ చేరారు. ఆఖర్లో వచ్చిన మైఖేల్ లియాస్క్‌ (42*) ధాటిగా ఆడినా ఫలితం లేకపోయింది.

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. స్కాట్లాండ్‌ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. కివీస్‌ బ్యాటర్లలో మార్టిన్‌ గప్తిల్ (93: 56 బంతుల్లో 4x6, 6X7) అర్ధ శతకంతో ఆకట్టుకోగా.. గ్లెన్‌ ఫిలిప్స్ (33) రాణించాడు. స్కాట్లాండ్‌ బౌలర్లలో సఫ్యాన్‌ షరీఫ్‌, బ్రాడ్లే వీల్‌ రెండేసి, మార్క్‌ వాట్‌ ఒక వికెట్‌ తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు