IND vs NZ: ఇదొక ‘అర్థంలేని సిరీస్‌’.. జోక్‌ చేశానన్న కివీస్‌ ఆల్‌రౌండర్‌

న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు భారత్‌ పర్యటనలో ఉంది. భారత్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌ను మరొక మ్యాచ్‌...

Updated : 21 Nov 2021 07:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు భారత్‌ పర్యటనలో ఉంది. మూడు టీ20ల సిరీస్‌ను మరొక మ్యాచ్‌ ఉండగానే భారత్‌ 2-0 తేడాతో గెలుచుకుంది. రెగ్యులర్‌ కెప్టెన్‌ కేన్ విలియమ్సన్ గైర్హాజరీతో టిమ్‌సౌథీ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. టీ20 సిరీస్‌ అనంతరం టీమ్‌ఇండియా, కివీస్‌ జట్ల మధ్య రెండు టెస్టులు జరుగుతాయి. ఈ క్రమంలో టీ20 సిరీస్‌ ఓడిపోవడంపై ఓ క్రికెట్ అభిమాని చేసిన ట్వీట్‌కు న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మెక్‌క్లాగెన్‌ స్పందిస్తూ.. ఇదొక ‘అర్థం లేని సిరీస్‌’గా అభివర్ణించాడు. 

ఏబీ డివిలియర్స్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సందర్భంగా మెక్‌క్లాగన్‌ ట్విటర్ వేదికగా స్పందిస్తున్న సమయంలో ఓ అభిమాని ‘న్యూజిలాండ్ సిరీస్‌ను కోల్పోయింది’ అని ట్వీట్‌ చేశాడు. దీనికి మెక్‌క్లాగన్‌ సమాధానం ఇస్తూ.. వారి కంటే (కివీస్‌) ఎక్కువ విశ్రాంతి తీసుకున్న స్వదేశీ జట్టుతో తలపడుతున్నట్లు పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడిన కివీస్‌ కేవలం 72 గంటల్లోనే దుబాయ్‌ నుంచి వచ్చి టీ20 సిరీస్‌లో పాల్గొందని ట్వీట్ చేశాడు. ఐదు రోజుల వ్యవధిలో మూడు మ్యాచ్‌లను ఆడిందని గుర్తు చేశాడు. అయితే కాసేపటికి మరొక అభిమాని ట్వీట్‌కు రిప్లే ఇస్తూ.. ‘‘నేను జోక్‌ చేశా. న్యూజిలాండ్‌ సిరీస్‌ను గెలవడాన్ని ఎప్పుడూ ఇష్టపడతా’’ అని పేర్కొన్నాడు. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని