Nikhat Zareen: జాతీయ మహిళల ఛాంపియన్‌షిప్‌.. విజేతగా నిలిచిన నిఖత్‌ జరీన్

తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ మరోసారి తన సత్తా చాటింది. అద్భుతమైన విజయంతో ఈ ఏడాదిని ఘనంగా ముగించింది. ఆరో మహిళల జాతీయ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో ప్రత్యర్థిని చిత్తు చేసి ఛాంపియన్‌గా నిలిచింది.

Published : 26 Dec 2022 13:32 IST

భోపాల్‌: తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్ జరీన్‌ 2022వ ఏడాదిని ఘనంగా ముగించింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ వేదికగా జరిగిన జాతీయ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకొని సత్తా చాటింది. ఫైనల్‌లో ప్రత్యర్థి అనామిక (రైల్వేస్‌)పై 4-1 తేడాతో నిఖత్‌ ఆధిపత్యం సాధించి గెలుపొందింది. 

50 కేజీల విభాగంలో పోటీ పడిన నిఖత్‌ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఆరంభం నుంచే దూకుడుగా బాక్సింగ్‌ చేసింది. దీంతో అనామిక ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఒక బౌట్‌ను గెలిచినప్పటికీ అనామికకు నిఖత్‌ చేతిలో ఓటమి తప్పలేదు. ఐదు రౌండ్లలో కేవలం చివరిదాంట్లో మాత్రమే జరీన్ కంటే అనామిక ఎక్కువ పాయింట్లను దక్కించుకోగలిగింది. కామన్వెల్త్ గేమ్స్ 2022, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శనతో నిఖత్‌ టైటిళ్లను గెలుచుకొన్న విషయం తెలిసిందే.

ఇక 75 కేజీల విభాగంలో జాతీయ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరిన లవ్లీనా కూడా అరుంధతి చౌదరితో పోటీ పడనుంది. ఎనిమిది మంది రైల్వేస్‌ బాక్సర్లు ఫైనల్‌కు చేరుకోవడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు