Nikhat Zareen : ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌.. ఫైనల్‌కు చేరిన తెలంగాణ యువతి

 అద్భుత ఫామ్‌లో ఉన్న తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ మరోసారి తన సత్తా ఏంటో ప్రపంచానికి...

Updated : 18 May 2022 21:44 IST

రెండు పతకాలు కైవసం చేసుకున్న భారత్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: అద్భుత ఫామ్‌లో ఉన్న తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ మరోసారి తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటింది. ఈ ఏడాది స్ట్రాండ్జా మెమోరియల్ టోర్నమెంట్‌లో బంగారు పతకం సాధించిన నిఖత్‌.. ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 52 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరుకుంది. సెమీస్‌లో బ్రెజిల్‌కు చెందిన కారోలైన్‌ డి అల్మెడపై 5-0 తేడాతో విజయం సాధించింది. కచ్చితంగా రజతం ఖాయమైనప్పటికీ.. బంగారు పతకం సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇప్పటివరకు ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ తరఫున మేరీకోమ్‌, సరితా దేవి, జెన్నీ ఆర్‌ఎల్‌, లేఖ సి మాత్రమే టైటిల్‌ను నెగ్గారు. ఇప్పుడు నిఖత్‌ గెలిస్తే వారి సరసన చేరుతుంది. మరోవైపు ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ రెండు పతకాలను గెలుచుకుంది. మనీషా మౌన్‌ (57 కిలోల విభాగంలో) ఇర్మా టెస్టా(ఇటలీ)పై 0-5 తేడాతో ఓడిపోయి క్యాంసంతో సరిపెట్టుకుంది. 63కిలోల విభాగంలో పర్వీన్‌ హుడా.. అమీ బ్రాడ్‌హ్రస్ట్‌ (ఐర్లాండ్‌)పై 1-4 తో ఓడిపోయి కాంస్యాన్ని గెలుచుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని