Published : 26 May 2022 01:14 IST

Nikhat Zareen : మేరీ కోమ్‌తో ఫొటో.. వైరల్‌గా మారిన నిఖత్‌ జరీన్ పోస్టు

(ఫొటో సోర్స్‌: నిఖత్‌ జరీన్ ట్విటర్)

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ యువతి నిఖత్ జరీన్‌ తన సోషల్ మీడియాలో పెట్టిన ఫొటోతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంతకీ ఆ ఫొటో ఏంటంటారా..? ఒలింపిక్స్ పతక విజేత మేరీ కోమ్‌తో కలిసి నిఖత్ జరీన్‌ ఉన్న పిక్‌ను ట్విటర్‌ పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. కేవలం గంటల వ్యవధిలోనే 13 వేలకుపైగా లైకులు, 595 రీట్వీట్లు వచ్చాయి. 

2020 టోక్యో ఒలింపిక్స్‌కు ముందు క్వాలిఫయిర్‌కు సంబంధించి నిఖత్‌, మేరీ కోమ్‌ మధ్య వివాదం రేగింది. ట్రయల్స్‌ నిర్వహించకుండా డైరెక్ట్‌గా ఎలా పంపిస్తారని నిఖత్‌ ప్రశ్నించడంతో మేరీకోమ్‌ను ఆగ్రహానికి గురి చేసింది. ఒకరిపై మరొకరు ఆరోపణలు మధ్య ఎట్టకేలకు ట్రయల్స్‌ నిర్వహించారు. అయితే మేరీకోమ్‌ గెలిచి ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. అయితే మ్యాచ్‌ అనంతరం నిఖత్‌తో చేయి కలపడానికి కూడానూ మేరీ కోమ్ ఇష్టపడలేదు. ‘‘నేను ఎందుకు షేక్‌ హ్యాండ్ ఇవ్వాలి? ఒకవేళ ఆమెకు గౌరవం కావాలంటే ముందు ఇవ్వడం నేర్చుకోవాలి. అలాంటి వారిని నేను అంతగా ఇష్టపడను. కేవలం నీ సత్తా ఏంటో రింగ్‌లో నిరూపించుకో..అంతేకానీ బయట కాదు’’ అని మేరీ కోమ్‌ అప్పుడు వ్యాఖ్యానించింది. 

అయితే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారం పతకం గెలిచిన ఐదో భారత బాక్సర్‌గా నిఖత్‌ జరీన్‌ నిలవడంతో మేరీ కోమ్‌ ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపింది. ‘గోల్డ్‌ మెడల్‌ గెలిచినందుకు కంగ్రాట్స్‌ నిఖత్‌. నీ చారిత్రక ప్రదర్శన పట్ల ఎంతో గర్వంగా ఉంది. భవిష్యత్తులోనూ అపూర్వ విజయాలు సాధించాలి’’ అని ట్వీట్ చేసింది. దీనికి రిప్లైగా మేరీకోమ్‌తో కలిసి దిగిన ఫొటోను నిఖత్ జరీన్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది.



Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని