WBC: ప్రపంచ పురుషుల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు 3 కాంస్యాలు

ప్రపంచ పురుషుల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. ఇప్పటికే సెమీస్‌ చేరి పతకాన్ని ఖాయం చేసుకున్న ముగ్గురు ఆటగాళ్లు కాంస్యంతోనే సరిపెట్టుకున్నారు.

Updated : 12 May 2023 22:25 IST

తాష్కెంట్‌: ప్రపంచ పురుషుల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ మూడు కాంస్య పతకాలను గెలుచుకుంది. ఇప్పటికే సెమీస్‌ చేరి పతకాన్ని ఖాయం చేసుకున్న ముగ్గురు ఆటగాళ్లు కాంస్యంతో సరిపెట్టుకున్నారు. 57 కేజీల విభాగం సెమీస్‌ పోరులో సైడల్‌ హోర్టా (క్యూబా)తో పోటీ పడాల్సిన మహమ్మద్‌ హుసాముద్దీన్‌ మోకాలి గాయం కారణంగా పోటీ నుంచి వైదొలిగి ప్రత్యర్థికి పంచ్‌ ఇచ్చే అవకాశాన్ని కోల్పోయాడు. మరోవైపు, 51 కేజీల విభాగం సెమీస్‌లో బిలాల బెనామా (ఫ్రాన్స్‌)తో పోటీపడి దీపక్‌ భోరియా ఓడిపోయి కాంస్య పతకాన్ని అందుకున్నాడు. 71 కేజీల సెమీస్‌లో అస్లాన్‌బెక్‌ (కజకిస్థాన్‌)తో నిశాంత్‌ తలపడి ఓటమిపాలై భారత్‌కు మూడో కాంస్యాన్ని అందించాడు.

డబ్ల్యూబీసీలో పతకాలు అందుకున్న గత ఛాంపియన్స్‌ వీరే..!

* విజేందర్‌ సింగ్‌ (కాంస్యం) - 2009

* వికాస్‌ కృష్ణన్‌ (కాంస్యం) - 2011

* శివ తాప (కాంస్యం) - 2015

* గౌరవ్‌ భిదురి (కాంస్యం) - 2017

* మనీశ్‌ కౌశిక్‌ (కాంస్యం) - 2019

* అమిత్‌ పంగల్‌ (వెండి) - 2019

* ఆకాశ్‌ కుమార్‌ (కాంస్యం) - 2021

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని