Niteesh: నితీశ్‌ వచ్చేశాడు

ఐపీఎల్‌లో అదరగొట్టిన తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్‌రెడ్డి టీమ్‌ఇండియా తలుపు తట్టాడు.  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆల్‌రౌండ్‌ ఆటతో మెరిసిన నితీశ్‌.. భారత టీ20 జట్టులో చోటు సంపాదించాడు.

Published : 25 Jun 2024 04:40 IST

భారత జట్టులో తెలుగబ్బాయి
జింబాబ్వే పర్యటనకు సారథిగా గిల్‌

దిల్లీ: ఐపీఎల్‌లో అదరగొట్టిన తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్‌రెడ్డి టీమ్‌ఇండియా తలుపు తట్టాడు.  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆల్‌రౌండ్‌ ఆటతో మెరిసిన నితీశ్‌.. భారత టీ20 జట్టులో చోటు సంపాదించాడు. అయిదు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం జింబాబ్వేలో పర్యటించనున్న భారత జట్టుకు నితీశ్‌ ఎంపికయ్యాడు. సోమవారం 15 మంది ఆటగాళ్లతో జట్టును ఎంపిక చేసిన బీసీసీఐ సీనియర్‌ సెలెక్షన్‌ కమిటీ.. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. టీ20 ప్రపంచకప్‌ జట్టులో స్థానం చేజారిన గిల్‌కు ఇప్పుడు భారత్‌కు సారథ్యం వహించే అవకాశం లభించింది. ఐపీఎల్‌లో సత్తాచాటిన రియాన్‌ పరాగ్, అభిషేక్‌శర్మ ప్రతిభకు గుర్తింపుగా టీమ్‌ఇండియాకు ఎంపికయ్యారు. అస్సాం రాష్ట్రం, ఈశాన్య భారత్‌ నుంచి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న తొలి ఆటగాడిగా పరాగ్‌ ఘనత సాధించాడు. టీ20 ప్రపంచకప్‌లో ఆడుతున్న వారిలో శాంసన్‌ మినహా ఎవరినీ ఎంపిక చేయలేదు. జులై 6న భారత్, జింబాబ్వే మధ్య తొలి టీ20 జరుగుతుంది. 

భారత టీ20 జట్టు: గిల్‌ (కెప్టెన్‌), జైశ్వాల్, రుతురాజ్‌ గైక్వాడ్, అభిషేక్‌శర్మ, రింకూ సింగ్, శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), ధ్రువ్‌ జురెల్‌ (వికెట్‌ కీపర్‌), నితీశ్‌కుమార్‌రెడ్డి, రియాన్‌ పరాగ్, వాషింగ్టన్‌ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్‌ ఖాన్, ఖలీల్‌ అహ్మద్, ముకేశ్‌ కుమార్, తుషార్‌ దేశ్‌పాండే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని