Ashes Test Series: యాషెస్‌లో ‘నోబాల్స్‌’ కలకలం

యాషెస్‌ సిరీస్‌ మొదలైందంటే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య వైరం.. మాటల యుద్ధం కనిపించడం సహజం. అయితే తొలి టెస్టులో మాత్రం నోబాల్స్‌ వ్యవహారం ఎక్కువ చర్చనీయాంశమైంది. గబ్బా వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ పదే పదే నోబాల్స్‌ వేయడం.

Updated : 10 Dec 2021 08:50 IST

బ్రిస్బేన్‌: యాషెస్‌ సిరీస్‌ మొదలైందంటే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య వైరం.. మాటల యుద్ధం కనిపించడం సహజం. అయితే తొలి టెస్టులో మాత్రం నోబాల్స్‌ వ్యవహారం ఎక్కువ చర్చనీయాంశమైంది. గబ్బా వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ పదే పదే నోబాల్స్‌ వేయడం.. మైదానంలోని అంపైర్‌ వాటిని గుర్తించకపోవడం వివాదాస్పదమవుతోంది. సుదీర్ఘ విరామం తర్వాత యాషెస్‌లో పునరాగమనం చేసిన స్టోక్స్‌.. తన తొలి ఓవర్లోనే నాలుగో బంతికి డేవిడ్‌ వార్నర్‌ (17)ను బౌల్డ్‌ చేశాడు. అయితే రిప్లేలో బంతి నోబాల్‌గా తేలడంతో వార్నర్‌ బతికిపోయాడు. కాని అసలు విషయం అప్పుడే వెలుగులోకి వచ్చింది. స్టోక్స్‌ అంతకుముందు వేసిన మూడు బంతులు కూడా నోబాల్సే. మూడో అంపైర్‌ పాల్‌ విల్సన్‌ సైతం ఈ విషయాన్ని గుర్తించలేదు. తొలి సెషన్‌లో 5 ఓవర్లు వేసిన స్టోక్స్‌ ఏకంగా 14 మార్లు గీత దాటగా.. కేవలం రెండు సార్లు మాత్రమే అంపైర్‌ నోబాల్‌గా ప్రకటించాడు. మ్యాచ్‌ అధికారుల పనితీరుపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా స్పందించింది. సాంకేతిక సమస్యల కారణంగా మూడో అంపైర్‌ ప్రతి బంతిని పరిశీలించలేకపోయారని తెలిపింది. అందుకే నోబాల్స్‌ను మైదానంలోని అంపైర్‌ నిర్ణయానికే వదిలేశాడని పేర్కొంది. అయితే వికెట్‌ పడిన బంతుల్ని మూడో అంపైర్‌ రిప్లేలో చూసుకుని నిర్ధారించుకునే అవకాశముండటంతో వార్నర్‌ బతికిపోయాడు. ఇక పేలవమైన అంపైరింగ్‌పై ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ విమర్శలు గుప్పించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని