Published : 24 May 2022 17:32 IST

Ashwin: రాజస్థాన్‌ కాకుండా.. మిగతా ఫ్రాంచైజీలేవీ అశ్విన్ బ్యాటింగ్‌ను సరిగా వాడుకోలేదు: భజ్జీ

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత టీ20 టోర్నీ సీజన్‌లో రాజస్థాన్‌ తరఫున ఆడుతున్న రవిచంద్రన్‌ అశ్విన్ బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో రాణిస్తూ  మంచి ఫామ్‌లో ఉన్నాడు. కీలక సమయాల్లో పరుగులు చేస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 14 మ్యాచులకుగాను పది ఇన్నింగ్స్‌ల్లో 146.40 స్ట్రైక్‌రేట్‌తో 183 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ధశతకం కూడా ఉంది. లీగ్ దశలో ఆఖరి మ్యాచ్‌లో కేవలం 23 బంతుల్లోనే 40 పరుగులు చేసి చెన్నైపై రాజస్థాన్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. దీని వల్లే రెండో స్థానంతో రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. అలానే బౌలింగ్‌లోనూ 11 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో అశ్విన్‌ ఫామ్‌పై టీమ్ఇండియా మాజీ ఆటగాడు హర్భజన్‌ సింగ్‌ ప్రశంసలు కురిపించాడు. రాజస్థాన్‌ మాదిరిగా టీ20 లీగ్‌లో ఇతర జట్లేవీ అశ్విన్‌ బ్యాటింగ్ సామర్థ్యాన్ని వినియోగించుకోలేదని పేర్కొన్నాడు.

‘‘అశ్విన్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేయగలడనే నమ్మకాన్ని రాజస్థాన్‌ ఉంచింది. ఇప్పటి వరకు టీ20 లీగ్‌లో ఏ జట్టూ అశ్విన్ బ్యాటింగ్  ప్రతిభను సరిగా వాడుకోలేదేమోనని  అనిపిస్తుంది. అయితే రాజస్థాన్‌ మాత్రం అశ్విన్‌ను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు పంపి ఫలితాలను రాబట్టింది. అంతేకాకుండా అశ్విన్ తన బ్యాటింగ్‌తో రాజస్థాన్‌ విజయం చేకూర్చి పెట్టాడు. రవిచంద్రన్ అశ్విన్‌లోని శక్తి సామర్థ్యాలను రాజస్థాన్‌ గుర్తించి అవకాశం కల్పించింది’’ అని హర్భజన్ సింగ్‌ వివరించాడు. ప్లేఆఫ్స్‌లో భాగంగా ఇవాళ తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ జరగనుంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్-లఖ్‌నవూ తలపడతాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు డైరెక్ట్‌గా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిన టీమ్‌కు మరొక అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌ విజేతతో రెండో క్వాలిఫయర్‌ ఆడుతుంది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని