ICC: ‘టీమ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్’ కెప్టెన్‌గా బాబర్‌ ఆజామ్‌

ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆటగాళ్లతో కూడిన ‘టీమ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్’ను ఇంటర్నేషనల్‌ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం ప్రకటించింది. ఇందులో ఒక్క భారత..

Published : 15 Nov 2021 18:29 IST

టీమిండియా ఆటగాళ్లకు దక్కని చోటు

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆటగాళ్లతో కూడిన ‘టీమ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్’ను ఇంటర్నేషనల్‌ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం ప్రకటించింది. ఇందులో ఒక్క భారత క్రికెటర్‌కు కూడా చోటు దక్కకపోవడం గమనార్హం. ఈ ఏడాది ఛాంపియన్స్‌గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు నుంచి ముగ్గురిని, రన్నర్స్ కివీస్‌ జట్టు నుంచి ఒకరిని, ఇంగ్లాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్ల నుంచి తలో ఇద్దరినీ ఉత్తమ ఆటగాళ్లుగా ఐసీసీ ప్యానెల్‌ ఎంపిక చేసింది. పాకిస్థాన్ పేసర్‌ షహీన్ షా అఫ్రిదీని రిజర్వ్‌ ప్లేయర్‌గా ప్రకటించింది. పాకిస్థాన్ జట్టు సెమీ ఫైనల్ చేరడంలో కీలకంగా వ్యవహరించిన బాబర్‌ ఆజామ్‌ను కెప్టెన్‌గా, ‘ప్లేయర్ ఆఫ్‌ ది టోర్నమెంట్’గా నిలిచిన డేవిడ్ వార్నర్‌, ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ జోస్ బట్లర్‌లను ఓపెనర్లుగా ఎంపిక చేసింది. టీ20 ప్రపంచకప్‌లో తొలి రెండు మ్యాచుల్లో టీమిండియా ఘోరంగా విఫలం కావడంతో.. కనీసం సెమీ ఫైనల్ కూడా చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. 

ఐసీసీ ప్రకటించిన జట్టిదే.. 

డేవిడ్‌ వార్నర్‌ (ఆస్ట్రేలియా), జోస్‌ బట్లర్‌ (వికెట్ కీపర్‌-ఇంగ్లాండ్), బాబర్‌ ఆజామ్‌ (కెప్టెన్‌-పాకిస్థాన్‌), చరిత్‌ అసలంక (శ్రీలంక), ఐడెన్‌ మార్‌క్రమ్‌ (దక్షిణాఫ్రికా), మొయిన్ అలీ ( ఇంగ్లాండ్‌), వణిందు హసరంగ (శ్రీలంక), ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా), జోష్‌ హేజిల్ వుడ్‌ (ఆస్ట్రేలియా), ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్‌), అన్రిచ్‌ నార్జ్‌ (దక్షిణాఫ్రికా), షహీన్ షా అఫ్రిది (రిజర్వ్‌ ప్లేయర్‌-పాకిస్థాన్‌)

Read latest Sports News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని