Gambhir-Akmal : గంభీర్‌తో వివాదం.. స్పందించిన పాక్ మాజీ ఆటగాడు

పన్నెండేళ్ల కిందట ఆసియా కప్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ప్రతి ఒక్కరికీ గుర్తుండే...

Published : 31 Jan 2022 01:04 IST

ఇంటర్నెట్ డెస్క్: 2010 ఆసియా కప్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. ఆ మ్యాచ్‌లో టీమ్ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్‌ గంభీర్‌, పాక్‌ మాజీ ఆటగాడు కమ్రాన్‌ అక్మల్‌ మధ్య మాటల యుద్ధం పతాకస్థాయికి చేరింది. అయితే పన్నెండేళ్ల కిందట చోటు చేసుకున్న ఆ వివాదంపై  కమ్రాన్‌ అక్మల్‌ తాజాగా స్పందించాడు. ప్రస్తుతం లెజెండ్స్ లీగ్‌ క్రికెట్ (ఎల్‌ఎల్‌సీ)లో అక్మల్‌ పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా గంభీర్‌, హర్భజన్‌ సింగ్‌లో ఎవరితో శత్రుత్వం ఉందని వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు కమ్రాన్‌ అక్మల్‌ సమాధానం ఇస్తూ.. ‘‘నా వరకైతే వారిద్దరితో (గంభీర్, భజ్జీ) ఎలాంటి విరోధభావం లేదు. కేవలం అపార్థం చేసుకోవడం వల్లే గంభీర్‌తో ఆసియా కప్‌ సంఘటన జరిగింది. గౌతమ్‌ గంభీర్‌ ఎంతో మంచి వ్యక్తి. అలానే అత్యుత్తమ క్రికెటర్‌ కూడానూ. మేం ఇద్దరం కలిసి ఆసియా టీమ్‌కూ ఆడాం. కాబట్టి మా మధ్య ఎలాంటి శత్రుత్వం లేదు’’ అని స్పష్టం చేశాడు.

అదేవిధంగా టీమ్ఇండియా పేస్‌ బౌలర్ ఇషాంత్ శర్మతో కూడా ఎలాంటి వివాదం లేదని కమ్రాన్‌ పేర్కొన్నాడు. 2012-13 సీజన్‌లో బెంగళూరు వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌ సందర్భంగా ఇషాంత్‌, అక్మల్ మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ‘‘బెంగళూరులో ఇషాంత్‌తో జరిగిన విషయంలోనూ ఎలాంటి వివాదం లేదు. అంతేకాకుండా అతడితో ఎలాంటి శత్రుత్వం లేదు’’ అని వెల్లడించాడు. పాకిస్థాన్‌ తరఫున కమ్రాన్‌ అక్మల్‌ 53 టెస్టుల్లో 2,648 పరుగులు, 157 వన్డేల్లో 3,236 పరుగులు చేశాడు. అలానే అంతర్జాతీయంగా 58 టీ20ల్లో 987 పరుగులు చేశాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని