IND vs WI : విండీస్‌తో టీ20 సిరీస్‌.. కోహ్లీ లేకుండానే భారత్‌ జట్టు ప్రకటన

వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే టాప్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ, పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాకు..

Updated : 22 Jul 2022 18:58 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే టాప్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీకి జట్టులో స్థానం దక్కలేదు. పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాతో చాహల్‌కు సెలక్షన్‌ కమిటీ విశ్రాంతినిచ్చింది. ఇప్పటికే ఇంగ్లాండ్‌తో తొలి వన్డేకు దూరమైన కోహ్లీ.. రెండో మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ క్రమంలో విండీస్‌తో టీ20 సిరీస్‌కు విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ సారథిగా.. కేఎల్ రాహుల్‌ వైస్ కెప్టెన్‌గా 18 మంది సభ్యులతో కూడిన జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు.  జులై 22 నుంచి విండీస్‌ పర్యటనను భారత్‌ ప్రారంభిస్తుంది. తొలుత మూడు వన్డేల సిరీస్‌లో విండీస్‌తో తలపడనుంది. జులై 29 నుంచి టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. టీ20 సిరీస్‌కు జట్టులోకి సీనియర్‌ స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్, కుల్‌దీప్ యాదవ్‌లకు స్థానం కల్పించగా.. ఉమ్రాన్‌ మాలిక్‌కు అవకాశం దక్కలేదు. ఇప్పటికే శిఖర్ ధావన్‌ నాయకత్వంలో వన్డే జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే.

టీ20 సిరీస్‌కు జట్టు: రోహిత్‌ (కెప్టెన్), కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్ యాదవ్, దీపక్‌ హుడా, శ్రేయస్‌ అయ్యర్, దినేశ్ కార్తిక్‌‌, రిషభ్‌ పంత్‌, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్,‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, రవి బిష్ణోయ్‌, కుల్‌దీప్ యాదవ్‌, భువనేశ్వర్ కుమార్‌‌, అవేశ్ ఖాన్‌, హర్షల్ పటేల్‌‌, అర్ష్‌దీప్‌ సింగ్‌

వన్డే సిరీస్‌కు : శిఖర్ ధావన్‌ (కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, శుభ్‌మన్‌ గిల్‌, దీపక్‌ హుడా, సూర్యకుమార్ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్, ఇషాన్‌ కిషన్‌, సంజూ శాంసన్‌, శార్దూల్‌ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్‌, అక్షర్‌ పటేల్‌, అవేశ్‌ ఖాన్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, సిరాజ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని