MS Dhoni: ధోని స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు : బాలాజీ

టీమ్‌ఇండియా మాజీ దిగ్గజ ఆటగాడు,  చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్కే) కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోని స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని మాజీ బౌలర్‌ లక్ష్మిపతి బాలాజీ అన్నాడు. జట్టులో ఉన్నంత కాలం..

Updated : 01 Dec 2021 09:46 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ దిగ్గజ ఆటగాడు,  చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్కే) కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోని స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని మాజీ బౌలర్‌ లక్ష్మిపతి బాలాజీ అన్నాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌‌-2022 సీజన్‌ మెగా వేలానికి సంబంధించి.. సీఎస్కే ఫ్రాంఛైజీ రిటెయిన్‌ చేసుకున్న ఆటగాళ్ల వివరాలను వెల్లడించడానికి వచ్చిన బాలాజీ పలు విషయాలు వెల్లడించాడు.

‘ధోని స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. చెన్నై జట్టుకి ఆడుతున్నంత కాలం అతడు కెప్టెన్‌గా కొనసాగుతాడు. యువ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌ని రిటెయిన్‌ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అతడి శక్తి సామర్థ్యాలపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మా జట్టులో కీలక ఆటగాడు. టీమ్‌ఇండియా తరఫున, చెన్నై జట్టు తరఫున అతడు ఇప్పటికే చాలా సార్లు తన సామర్థ్యమేంటో నిరూపపించుకున్నాడు. అవసరమైన సమయంలో బంతితో పాటు, బ్యాటుతోనూ గొప్పగా రాణించగలడు. మొయీన్ అలీని రిటెయిన్‌ చేసుకోవడంతో జట్టుకి సమతూకం వచ్చింది. అటు ఆఫ్‌ స్పిన్ బౌలర్‌గానూ, ఇటు ఎడమ చేతి వాటం బ్యాటర్‌గానూ అలీ పనికొస్తాడు. రాబోయే సీజన్‌ కోసం ఎదురు చూస్తున్నాం’ అని బాలాజీ పేర్కొన్నాడు.   

ఇదిలా ఉండగా, సీఎస్కే యాజమాన్యం ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాని మొదటి ప్రాధాన్య ఆటగాడిగా, ధోనిని రెండో ప్రాధాన్య ఆటగాడిగా ఎంచుకుంది. ఈ నిర్ణయంతో ధోని కంటే జడేజా రూ.4 కోట్లు ఎక్కువగా అందుకోనున్నాడు. జడేజాకు రూ.16 కోట్లు, ధోనికి రూ.12 కోట్లు దక్కనున్నాయి. మొయీన్‌, రుతురాజ్‌లకు వరుసగా రూ.8 కోట్లు, రూ.6 కోట్లు లభించనున్నాయి.

Read latest Sports News and Telugu News



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని