Rishabh Pant: పంత్ కంటే అతడే బెటర్: న్యూజిలాండ్ మాజీ క్రికెటర్
రిషభ్ పంత్ టీ20, వన్డేల్లో అంచనాలకు తగ్గట్లుగా రాణించలేక విమర్శలపాలవుతున్నాడు. అతడి స్థానంలో సంజూ శాంసన్‌ను తీసుకోవాలనే డిమాండ్లూ వస్తున్నాయి. ఇంకెన్ని అవకాశాలు ఇస్తారనే ప్రశ్నలూ తలెత్తాయి.
ఇంటర్నెట్ డెస్క్: టెస్టుల్లో అదరగొట్టేస్తున్న టీమ్‌ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ గత కొంతకాలంగా వన్డేలు, టీ20ల్లో మాత్రం తేలిపోతున్నాడు. దూకుడుగా ఆడాల్సిన సమయంలోనూ విఫలమై విమర్శపాలవుతున్నాడు. అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోవడంలో మాత్రం తడబాటుకు గురవుతున్నాడు. పంత్‌ను పక్కన పెట్టేసి సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌కు అవకాశాలు ఇవ్వాలనే డిమాండ్లు వస్తున్నాయి. తొలి వన్డేలో శాంసన్ బాగానే బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ మాజీ ఆటగాడు సైమర్ డౌల్ కూడా ఇలానే స్పందించాడు. పంత్ కంటే సంజూ శాంసన్‌కు ఛాన్స్ ఇవ్వాలని సూచించాడు.
‘‘గత కొన్ని రోజులుగా రిషభ్ పంత్ రికార్డును పరిశీలిస్తే చాలా దారుణంగా ఉంది. దాదాపు 30 మ్యాచ్‌లు ఆడితే స్ట్రైక్‌రేట్ ఫర్వాలేదనిపించినా సగటు 35 మాత్రమే. అదే సంజూ శాంసన్ కేవలం 11 మ్యాచుల్లోనే 60 సగటుతో పరుగులు చేశాడు. అందుకే సంజూకే అవకాశాలు ఇవ్వాలని చెబుతా. తుదిజట్టులో పంత్-సంజూ ఎవరుండాలనే చర్చ ఆసక్తికరంగా ఉంటుంది. రిషభ్ పంత్ గురించి చాలా చెప్పొచ్చు. టెస్టుల్లో రాణించే పంత్ తెల్లబంతి ఫార్మాట్‌లో (వన్డేలు, టీ20లు) మాత్రం ఉత్తమ కీపర్ - బ్యాటర్ మాత్రం కాదు’’ అని డౌల్ స్పష్టం చేశాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
AP Govt: ఎవరి గ్లాసు వారే తెచ్చుకోండి.. రాగి జావ పోస్తాం
-
Politics News
Nara Lokesh: ఎమ్మెల్సీ ఎన్నికలు ట్రైలర్ మాత్రమే.. 2024 పూర్తి సినిమా: నారా లోకేశ్
-
Crime News
Andhra News: టిప్పర్ డ్రైవరా మజాకా.. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సాహసం..
-
Politics News
Botsa: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక చిన్నది: మంత్రి బొత్స
-
Politics News
OTT : ఓటీటీ ప్లాట్‌ఫాంను సెన్సార్ పరిధిలోకి తేవాలి: కూనంనేని
-
Politics News
Payyavula: ‘వై నాట్ 175’ అనే గొంతులు మూగబోయాయి: పయ్యావుల