virat kohli: విరాట్‌ను గొప్ప కెప్టెన్‌ అనలేం: వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌

విరాట్‌ కోహ్లీని గొప్ప కెప్టెన్‌గా తాను పేర్కొనలేంటూ వెస్టిండీస్‌ మాజీ పేసర్‌ విన్‌స్టన్‌ బెంజిమన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Published : 05 Oct 2022 16:47 IST

దిల్లీ: టీమ్‌ఇండియా దిగ్గజ ఆటగాడు విరాట్‌ కోహ్లీని గొప్ప కెప్టెన్‌గా తాను పేర్కొనలేంటూ వెస్టిండీస్‌ మాజీ పేసర్‌ విన్‌స్టన్‌ బెంజిమన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ వారికి శిక్షణ ఇస్తోన్న ఈ సీనియర్‌ ఆటగాడు సచిన్‌ తెందూల్కర్‌కు ఇటీవల ఓ విన్నపం చేసి వార్తల్లో నిలిచాడు. తమ కుర్రాళ్లకు అవసరమైన క్రికెట్‌ కిట్లను అందించాలని సచిన్‌ను కోరగా.. అందుకు పూమా కంపెనీ స్పందించి భారీ సాయం ప్రకటించింది.  తాజాగా బెంజిమన్‌ దీనిపై హర్షం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా క్రికెట్‌ గురించిన తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నాడు. 

‘‘విరాట్‌ను టీమ్‌ఇండియా గొప్ప కెప్టెన్‌ అనడం సరికాదని నేను భావిస్తాను. సారథ్య బాధ్యతలను మోయడం కన్నా అతడు బ్యాటింగ్‌పై మరింత దృష్టి పెడితేనే బాగుంటుంది. ఎందుకంటే అలాంటి బ్యాటర్‌ను నేను ఇంతవరకూ చూడలేదు. కొన్నేళ్లుగా భారత క్రికెటర్లు ఎంతో మెరుగ్గా ఆడుతున్నారు. జస్ప్రీత్‌ బుమ్రా వంటి వారు బౌలింగ్‌తో చెలరేగుతున్నారు. ఇంకా ఎంతో మంది ప్రతిభ ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. కోహ్లీ కన్నా ముందు జట్టును నడిపించిన వారు వ్యూహాత్మకంగా కాస్త మెరుగని నా అభిప్రాయం. కానీ అద్భుతమైన బ్యాటర్లలో అతడు ఒకడు’’ అంటూ తెలిపాడు. రానున్న టీ20 ప్రపంచకప్‌లో విండీస్‌ జట్టు టాప్‌ 4 లో ఉండొచ్చని విశ్లేషించాడు. అందుకు కారణం వారి అస్థిరమైన ఆటతీరేనన్నాడు. తమను తాము రుజువు చేసుకోవడానికి ఇదో గొప్ప అవకాశం అని, ఇప్పటికైనా ఆ దిశగా వారు ప్రయత్నిస్తారని ఆశిస్తున్నట్టుగా పేర్కొన్నాడు. 

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని