IND vs NZ: ఆ ఒక్క రికార్డుతో జీవితమేం మారిపోదు.. కానీ : అజాజ్‌ పటేల్‌

ముంబయి వేదికగా జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌.. ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసి అరుదైన రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘనతతో మాజీ క్రికెటర్లు జిమ్

Published : 07 Dec 2021 17:39 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ముంబయి వేదికగా జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌.. ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసి అరుదైన రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘనతతో మాజీ క్రికెటర్లు జిమ్ లేకర్‌, అనిల్‌ కుంబ్లే తర్వాత టెస్టు క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా అజాజ్‌ చరిత్రకెక్కాడు. ఈ రికార్డుపై అతడు తాజాగా స్పందించాడు. ఆ ఒక్క రికార్డుతో జీవితం ఏం మారిపోదని అన్నాడు. కానీ, న్యూజిలాండ్ తరఫున మర్నిన్ని టెస్టులు ఆడేందుకు సహాయపడొచ్చని పేర్కొన్నాడు. 

‘ఈ రోజు నేను సాధించిన ఘనత అరుదైనదే. తొమ్మిదో వికెట్ తీసేంత వరకు కూడా.. రికార్డుల గురించి ఆలోచించలేదు. ఎందుకంటే, అప్పటికే చాలా ఓవర్లు బౌలింగ్‌ చేయడం వల్ల అలిసిపోయాను. ఒక స్పిన్నర్‌గా నేను వేసే ప్రతి బంతిని చాలా కచ్చితత్వంతో వేయాలి. అందుకే, వికెట్ల గురించి ఎక్కువగా ఆలోచించకుండా మెరుగైన బంతులేసేందుకు ప్రయత్నించాను. అదృష్టవశాత్తు ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసి అరుదైన మైలురాయిని చేరుకోగలిగాను. అయితే, ఈ ఒక్క రికార్డుతో నా జీవితం ఏం మారిపోదు. కానీ, న్యూజిలాండ్ తరఫున 80-90 టెస్టు మ్యాచులు ఆడేందుకు ఉపయోగపడొచ్చు. ఇప్పటి వరకు నేను కేవలం 11 టెస్టులే ఆడాను. నా కెరీర్లో ఇంకా చాలా సాధించాల్సి ఉంది. క్రికెట్లో పాఠాలు నేర్చుకున్నది.. అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగింది న్యూజిలాండ్‌లోనే. అందుకే, కివీస్‌ తరఫున ఆడుతున్నందుకు గర్వపడుతుంటాను’ అని అజాజ్‌ పటేల్ పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని