Djokovic: టెన్నిస్‌ స్టార్‌ జకోవిచ్‌ను ఓడించిన 20 ఏళ్ల కుర్రాడు

టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌కు ఓటమి ఎదురైంది. అదీనూ ఓ 20 ఏళ్ల కుర్రాడి చేతిలో కావడం గమనార్హం. రోమ్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీ క్వార్టర్ ఫైనల్‌ మ్యాచ్‌లో ఓడిపోయాడు.

Updated : 18 May 2023 17:23 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌కు ఓటమి ఎదురైంది. అదీనూ ఓ 20 ఏళ్ల కుర్రాడి చేతిలో కావడం గమనార్హం. రోమ్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీ క్వార్టర్ ఫైనల్‌ మ్యాచ్‌లో జకోవిచ్‌పై 6-2, 4-6, 6-2 తేడాతో డెన్మార్క్‌కు చెందిన హోల్గర్‌ రునె విజయం సాధించాడు. వర్షం ఆటంకం కలిగించిన కీలక పోరులో జకోవిచ్‌ ఓడిపోయాడు. ఇంతకుముందు మాస్టర్స్‌ 1000 టోర్నీలోనూ (గతేడాది నవంబర్‌లో) జకోను రునె ఓడించి చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు మరోసారి ఇటాలియన్‌ ఓపెన్‌లోనూ ఓడించి పైచేయి సాధించడం విశేషం. దీంతో తొలిసారి జకోవిచ్‌, నాదల్‌ వంటి టాప్‌ ఆటగాళ్లు లేకుండా ఫైనల్‌లో కొత్త ఆటగాళ్లు తలపడే అవకాశం ఉంది.

గత కొన్ని వారాలుగా మోచేతి నొప్పితో బాధపడుతున్న జకోవిచ్‌ ఈ టోర్నీలోనూ అలాగే బరిలోకి దిగాడు. పెయిన్‌ కిల్లర్స్‌ వాడుతూ మ్యాచ్‌లను ఆడాడు. జకోవిచ్‌ వరుసగా 17వ సారి ఇటాలియన్‌ ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు. అయితే, హోల్గర్‌ రునె మాత్రం అద్భుతమైన ఆటతీరుతో జకోవిచ్‌ను ఓడించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని