Novak Djokovic: జకోవిచ్‌ గతనెలలోనే కరోనా బారినపడ్డాడు.. అందుకే ఇలా..!

టెన్నిస్ నంబర్‌ వన్‌ క్రీడాకారుడు నోవాక్‌ జకోవిచ్‌ గతనెలలోనే కొవిడ్‌-19 బారిన పడ్డాడని అందువల్లే అతడికి ‘ఆస్ట్రేలియా ఓపెన్‌’లో పాల్గొనడానికి వైద్యపరమైన ప్రత్యేక మినహాయింపు ఇచ్చరాని...

Published : 08 Jan 2022 16:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టెన్నిస్ నంబర్‌ వన్‌ క్రీడాకారుడు నోవాక్‌ జకోవిచ్‌ గతనెలలోనే కొవిడ్‌-19 బారిన పడ్డాడని అందువల్లే అతడికి ‘ఆస్ట్రేలియా ఓపెన్‌’లో పాల్గొనడానికి వైద్యపరమైన ప్రత్యేక మినహాయింపు ఇచ్చరాని ఆయన తరఫున లాయర్లు శనివారం మెల్‌బోర్న్‌లోని ఫెడరల్‌ కోర్టుకు విన్నవించారు. జకోవిచ్‌ ఈ సీజన్‌లో తొలి గ్రాండ్ స్లామ్‌ టోర్నీ అయిన ‘ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌’లో పాల్గొనేందుకు మూడు రోజుల క్రితం మెల్‌బోర్న్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు.

అతడికి సరైన వీసా అనుమతులు, వైద్యపరమైన మినహాయింపులున్నా.. వాక్సినేషన్‌కు సంబంధించిన ధ్రువపత్రాలు లేని కారణంగా ఆస్ట్రేలియా బోర్డర్‌ ఫోర్స్‌ అధికారులు అడ్డుకున్నారు. జకోవిచ్‌ వీసాను రద్దు చేసి డిటెన్షన్‌ సెంటర్‌లో ఉంచారు. ఈ విషయం పెద్ద చర్చనీయాంశంగా మారగా.. అక్కడే ఉన్న జకోవిచ్‌ ఆస్ట్రేలియా తీరుపై న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించాడు. ఈ క్రమంలోనే శనివారం తన లాయర్ల ద్వారా వాదనలు వినిపించాడు. అలాగే ఇప్పుడు అతడు ఉంటున్న డిటెన్షన్‌ సెంటర్‌ నుంచి తరలించాలని, ఈనెల 17 నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పాల్గొనేందుకు తనకు వీసా రద్దును తొలగించాలని కోరాడు. ఇప్పుడు తనకు ప్రాక్టీస్‌ చేసుకునే వీలు కల్పించాలని కూడా ఈ నంబర్‌ వన్‌ ఆటగాడు అభ్యర్థించాడు. మరోవైపు జకోవిచ్‌ ఉంటున్న ప్రదేశంలో పలువురు సెర్బియన్‌ పౌరులు నిరసన తెలిపారు. అతడిని ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనేలా చూడాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని