French Open: అల్కరాస్‌పై ప్రతీకారం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లిన జకోవిచ్
ఫ్రెంచ్ ఓపెన్ (French Open) పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌కు జరిగిన సెమీస్ పోరులో టాప్ సీడ్ ఆటగాడు అల్కరాస్‌పై మూడో సీడ్ ఆటగాడు జకోవిచ్ ఘన విజయం సాధించాడు. ఈ గెలుపుతో ఫైనల్స్‌కు అర్హత సాధించిన జకోవిచ్, తన కెరీర్‌లో ఏడో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ ఆడనున్నాడు.
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ సెమీస్‌లో సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్ (Novak Djokovic) ఘన విజయం సాధించాడు. ఈ గెలుపుతో జకోవిచ్ ఫైనల్‌లో ఆడేందుకు బెర్త్ ఖాయం చేసుకున్నాడు. శుక్రవారం స్పెయిన్ ఆటగాడు కార్లోస్ అల్కరాస్ (Carlos Alcaraz)తో సెమీఫైనల్లో తలపడ్డాడు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆట ఆరంభం నుంచి జకోవిచ్ ఆధిపత్యం కొనసాగించాడు. తొలి సెట్‌లో 6-3తో జకోవిచ్ పైచేయి సాధించగా, రెండో సెట్‌ను 5-7తో అల్కరాస్ గెలిచి సమం చేశాడు. అనంతరం పుంజుకున్న జకోవిచ్ వరుసగా మూడు, నాలుగు సెట్లలో 6-1, 6-1తో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు.
ఈ గెలుపుతో జకోవిచ్ తన కెరీర్‌లో ఏడో సారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇంతకుముందు జకోవిచ్-అల్కరాస్ ఒకే ఒక్కసారి తలపడగా.. అందులో అల్కరాస్ విజేతగా నిలిచాడు. ఇప్పుడు జకోవిచ్ గెలిచి ప్రతీకారం తీర్చుకున్నాడు. 36 ఏళ్ల జకోవిచ్.. 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో అత్యధిక మేజర్ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా రికార్డు సృష్టించాలనే లక్ష్యంతో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్కరాస్ ప్రపంచర్యాంకుల్లో నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. అత్యంత పిన్న వయసులోనే టాప్ ర్యాంక్‌ను సాధించిన ఆటగాడు అల్కరాస్ కావడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.