Hardik Pandya: ఎవరు ఏమనుకున్నా సరే.. హార్దిక్‌ పాండ్యనే నంబర్‌వన్‌ ఆల్‌రౌండర్‌!

టీ20 ప్రపంచ కప్‌ కోసం ప్రకటించిన టీమ్‌ఇండియాలో ఏకైక పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య. భారత టీ20 లీగ్‌ గత సీజన్‌లో కెప్టెన్‌గా గుజరాత్‌కు టైటిల్‌ను అందించిన...

Published : 18 Sep 2022 16:17 IST

టీమ్‌ఇండియా మాజీ ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచ కప్‌ కోసం ప్రకటించిన భారత జట్టులో పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యకు సెలెక్షన్‌ కమిటీ చోటు కల్పించింది. భారత టీ20 లీగ్‌ గత సీజన్‌లో కెప్టెన్‌గా గుజరాత్‌కు టైటిల్‌ను అందించిన హార్దిక్‌.. గాయం నుంచి కోలుకొన్నాక బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో రాణిస్తున్నాడు. ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లోనూ ఫర్వాలేదనిపించాడు. పాకిస్థాన్‌పై కీలక ఇన్నింగ్స్‌ ఆడి భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. వచ్చే ప్రపంచకప్‌లోనూ రాణించి జట్టుకు విజయాలను అందించాలని అభిమానులు కోరుతున్నారు. ఈ క్రమంలో హార్దిక్‌ పాండ్యనే నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌ అని టీమ్ఇండియా మాజీ ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి మరోసారి స్పష్టం చేశాడు.  

‘‘టీమ్‌ఇండియా నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య. నేను ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టా. టీ20 ఫార్మాట్‌లో హార్దికే నంబర్‌వన్‌ అని మరోసారి చెబుతున్నా. ప్రతి ఒక్కరూ తమదైన అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ ఉంది. బయటి వ్యక్తులు ఏమి చెప్పాలని అనుకుంటారో వారిష్టం. నా అభిప్రాయం మాత్రం స్పష్టంగా ఉంది’’ రవిశాస్త్రి వెల్లడించాడు. ఇటీవల ఆసియా కప్‌లో పాక్‌తో మ్యాచ్‌ సందర్భంగా హార్దిక్‌ పాండ్య నాలుగు ఓవర్లు వేసి 44 పరుగులు ఇచ్చి కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే తీశాడు. దీంతో హార్దిక్‌ను టీ20 ప్రపంచకప్‌లో మూడో బౌలర్‌గా కంటే నాలుగో పేసర్‌గా తీసుకుంటేనే ఉత్తమమని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్‌  పేర్కొన్నాడు. దీనిపైనే తాజాగా రవిశాస్త్రి ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ స్పందించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని