
Rohit Sharma : విండీస్‌తో సిరీస్‌కు రోహిత్ శర్మ
దిల్లీ: టీమ్‌ఇండియా వన్డే, టీ20 జట్ల కెప్టెన్ రోహిత్‌శర్మ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడు. వచ్చేనెలలో సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు రోహిత్ అందుబాటులో ఉండనున్నాడు. ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు మూడేసి వన్డేలు, టీ20 మ్యాచ్‌ల్లో భారత్.. విండీస్ తలపడతాయి. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు నెట్ ప్రాక్టీసులో రోహిత్‌కు తొడ కండరాల గాయమైంది. దీంతో అతను సఫారీ పర్యటనకు దూరమయ్యాడు. ‘‘జాతీయ క్రికెట్ అకాడమీలో రోహిత్ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడు. విండీస్‌తో సిరీస్‌కు అతను పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశముంది. ఫిబ్రవరి 6న అహ్మదాబాద్‌లో జరిగే తొలి వన్డేకు ఇంకా మూడు వారాల సమయం ఉంది’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.