Viral video: అభిమాని వదిలిన కాగితపు విమానం.. దూసుకొచ్చి గోల్‌ కొట్టింది..

అది యూఈఎఫ్‌ఏ నేషన్స్‌ లీగ్‌.. ఇంతలో మైదానంలోకి దూసుకొచ్చిన ఓ కాగితపు విమానం అందరి దృష్టినీ ఆకర్షించింది.

Published : 25 Nov 2022 13:22 IST

బెర్లిన్‌: అది యూఈఎఫ్‌ఏ నేషన్స్‌ లీగ్‌.. జర్మనీ, ఇంగ్లాండ్‌ ఫుట్‌బాల్‌ జట్ల మధ్య ఉత్కంఠ రేపే పోరు జరుగుతోంది. ఇంతలో మైదానంలోకి దూసుకొచ్చిన ఓ కాగితపు విమానం అందరి దృష్టినీ ఆకర్షించింది. అంతా చూస్తుండగానే ఆటగాళ్ల చుట్టూ తిరిగి కొన్ని సెకన్ల పాటు గాల్లో చక్కర్లు కొట్టింది. చివరకు  గోల్‌ కొట్టినట్టుగా నెట్‌లోకి వెళ్లి పడటంతో స్టేడియం హోరెత్తింది. 

జర్మనీలో ఉన్న అలియాంజ్‌ అరేనా స్టేడియంలో ఈ ఏడాది జూన్‌లో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ఈ సన్నివేశం కనిపించింది. ఓ అభిమాని మ్యాచ్‌ టికెట్‌తో సరదాగా ఓ విమానాన్ని చేసి దాన్ని గ్రౌండ్‌లోకి వదిలాడు. అదికాస్తా ఆటగాళ్ల మధ్యకు చేరి.. అక్కడి నుంచి అచ్చం గోల్‌కొట్టినట్లు నెట్‌లోకి వెళ్లి పడింది. ఈ వీడియోను ఓ నెటిజన్ ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా.. ‘‘ఇది గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కాల్సిన విషయం’’, ‘‘అద్భుతమైన గోల్‌’’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు