Cricket News: జాతివిద్వేష ట్వీట్‌తో క్రికెటర్‌ సస్పెండ్‌

ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ ఒలీ రాబిన్‌సన్‌కు షాక్‌! అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి అతడిని సస్పెండ్‌ చేస్తున్నట్టు ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. ...

Published : 07 Jun 2021 11:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ ఒలీ రాబిన్‌సన్‌కు షాక్‌! అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి అతడిని సస్పెండ్‌ చేస్తున్నట్టు ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. 2012-13లో చేసిన జాతి వివక్ష, విద్వేష, లైంగిక వ్యాఖ్యలపై విచారణ చేపట్టనుంది. వెంటనే అతడు జాతీయ శిబిరాన్ని వదిలి ససెక్స్‌కు వెళ్తాడని ప్రకటించింది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగే రెండో టెస్టులో అతడు ఆడడని స్పష్టం చేసింది.

న్యూజిలాండ్‌తో తొలి టెస్టుల్లోనే రాబిన్‌సన్‌ అరంగేట్రం చేయడం గమనార్హం. ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటుతో 42 పరుగులతో కీలకంగా నిలవడం గమనార్హం. యువకుడిగా ఉన్నప్పుడు అతడు జాతి వివక్ష వ్యాఖ్యలను ట్వీట్ చేశాడు. ఆసియా జాతులను అవమానిస్తూ విద్వేష వ్యాఖ్యలు పెట్టాడు. వాటిపై తొలి టెస్టు సందర్భంగా దుమారం చెలరేగింది. అప్పుడు తెలియక చేశానని, అందుకు పశ్చాత్తాపం చెందుతున్నానని, క్షమాపణలు తెలియజేసినా వేటు పడక తప్పలేదు.

రాబిన్‌సన్‌ తొలి టెస్టులో బాగా ఆడాడని ఇంగ్లాండ్‌ సారథి జోరూట్‌ ప్రశంసించాడు. మైదానం ఆవల అతడు చేసింది మాత్రం తప్పేనని స్పష్టం చేశాడు. ‘అతడు బ్యాటు, బంతితో అద్భుతంగా రాణించాడు. అత్యున్నత స్థాయిలో కొనసాగగల సామర్థ్యం ఉంది. రాబిన్‌సన్‌ టెస్టుల్లో విజయవంతం కాగలడు. అయితే బయట జరిగింది మాత్రం అంగీకారం కాదు. అతడు డ్రస్సింగ్‌రూమ్‌లో అంతా చెప్పాడు. మీడియాకు చెప్తాడు. పశ్చాత్తాపంతో కనిపించాడు’ అని తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని