IND vs BAN: మ్యాచ్ విషయంలో ఎక్కడా రాజీపడలేదు.. వారికి అవకాశం ఇవ్వాలనుకున్నాం: రోహిత్ శర్మ
ఆసియా కప్ 2023 ఫైనల్‌కు (IND vs SL Final) భారత్ చేరిన సంగతి తెలిసిందే. ఆదివారం శ్రీలంకతో టైటిల్‌పోరులో తలపడనుంది. అయితే, సూపర్ -4లో నామమాత్రమైన చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో (IND vs BAN) ఓటమి తప్పలేదు. అయితే, సీనియర్లకు టీమ్‌ఇండియా విశ్రాంతి ఇచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ ఫైనల్‌కు చేరిన భారత్‌కు నామమాత్రమైన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఝలక్ (IND vs BAN) ఇచ్చింది. బౌలింగ్‌కు అనుకూలంగా మారిన పిచ్‌పై ఆ జట్టు బౌలర్లు అద్భుతం చేశారు. 266 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ను 259 పరుగులకే కట్టడి చేశారు. టాస్ నెగ్గిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బౌలింగ్‌కు సహకరిస్తుందని తెలిసినా.. తన జట్టును పరీక్షించుకోవడానికి ఈ మ్యాచ్‌ను వినియోగించుకున్నట్లు టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.
‘‘రిజర్వ్‌బెంచ్‌పై ఉన్న ఆటగాళ్లను పరీక్షించడానికి ఈ మ్యాచ్‌ను వాడుకున్నాం. మరి కొద్ది రోజుల్లో మెగా టోర్నీను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. అయితే, ఈ మ్యాచ్‌ను ఆడే విషయంలో మాత్రం ఎలాంటి రాజీ పడలేదు. వరల్డ్ కప్ జట్టులోని మిగతా ఆటగాళ్లకూ అవకాశం ఇచ్చాం. అక్షర్ పటేల్ లోయర్ ఆర్డర్‌లో అదరగొట్టాడు. అయితే, మ్యాచ్‌ను గెలిపించలేకపోయినప్పటికీ తీవ్రంగా ప్రయత్నించాడు. బంగ్లాదేశ్ బౌలర్లను అభినందించాలి. చాలా కట్టుదిట్టంగా బంతులను సంధించారు. శుభ్‌మన్ గిల్ సెంచరీతో అలరించినప్పటికీ మేం విజయం సాధించలేకపోయాం. గిల్ తన మునుపటి ఫామ్‌ను అందుకోవడం బాగుంది. జట్టు కోసం ఎప్పుడు ఎలా ఆడాలనేది గిల్‌కు బాగా తెలుసు. కొత్త బంతిని చాలా చక్కగా ఎదుర్కొంటాడు. నెట్స్‌లోనూ తీవ్రంగా కష్డపడతాడు’’ అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు.
స్పిన్నర్లు అద్భుతం చేశారు: షకిబ్
‘‘ఆసియా కప్‌లో ఆడలేకపోయిన వారికి అవకాశం ఇచ్చాం. గత కొన్ని మ్యాచ్‌ల తర్వాత మా స్పిన్నర్లు అద్భుతం చేశారు. భారత్‌తో మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు వెళ్లాలని నిర్ణయించుకుని మరీ క్రీజ్‌లోకి వచ్చా. వికెట్ చాలా సవాల్ విసిరింది. తొలుత సీమ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ.. బంతి పాతబడిన కొద్దీ బ్యాటింగ్‌కు ఈజీగా మారింది. గిల్ అద్భుతంగా ఆడుతున్న సమయంలో మా బౌలర్ మహెది హసన్ బౌలింగ్ చేయడానికి వచ్చి మాకు బ్రేక్ ఇచ్చాడు. తంజిమ్ కూడా ఆరంభం నుంచి మంచి ప్రదర్శన ఇచ్చాడు. ఆసియా కప్ బరిలోకి దిగేటప్పుడు చాలా మంది గాయాలపాలయ్యారు. అయితే, వరల్డ్ కప్‌లో మేం తప్పకుండా ప్రమాదకారిగా మారతామని భావిస్తున్నా’’ అని బంగ్లాదేశ్ కెప్టెన్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ షకిబ్ అల్ హసన్ తెలిపాడు.
మరికొన్ని విశేషాలు..
- భారత్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షకిబ్ కొనసాగుతున్నాడు. టీమ్‌ఇండియాపై 29 వికెట్లు పడగొట్టాడు.
- భారత్‌తో జరిగిన గత నాలుగు మ్యాచుల్లో బంగ్లాదేశ్ మూడింటిని గెలిచింది. కేవలం ఒక్కదాంట్లోనే ఓటమిపాలైంది.
- వివిధ దేశాలు పాల్గొనే వన్డే టోర్నీల్లో భారత్‌పై మూడు మ్యాచుల్లోనూ బంగ్లాదేశ్ విజయం సాధించింది. 2007 వరల్డ్ కప్‌లో ఐదు వికెట్ల తేడాతో, 2012 ఆసియా కప్‌లో ఐదు వికెట్ల తేడాతో, తాజా ఆసియా కప్‌లోనూ ఆరు పరుగుల తేడాతో బంగ్లా గెలిచింది.
- భారత బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఈ ఏడాది వన్డేల్లో 1000కిపైగా పరుగులు సాధించాడు. అలాగే ఒకే ఏడాదిలో ఆరో శతకం బాదాడు. 32 వన్డేల తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా గిల్ నిలిచాడు. ప్రస్తుతం 1,712 పరుగులు చేయగా.. హషీమ్ ఆమ్లా (1,650)ను వెనక్కి నెట్టాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
KTR: ఓఆర్ఆర్ చుట్టూ సైకిల్ ట్రాక్.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-
Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
ODI WC 2023: రోహిత్ ఫామ్‌లో ఉంటే తట్టుకోవడం కష్టం: పాక్ వైస్ కెప్టెన్
-
USA vs China: ‘తప్పుడు సమాచారం’పై.. అమెరికా-చైనా మాటల యుద్ధం
-
Social Look: దీపికా పదుకొణె ‘కోల్డ్ మీల్’.. శ్రీనిధి శెట్టి ‘ఈఫిల్ టవర్’ పిక్!
-
Manipur : మణిపుర్ విద్యార్థుల హత్య కేసు.. నలుగురిని అరెస్టు చేసిన సీబీఐ