Virat Kohli: విరాట్‌ కోహ్లీ రన్నింగ్‌పై సూర్యకుమార్ కామెంట్‌..

Virat Kohli: ఓ ప్రమోషన్‌లో భాగంగా విరాట్‌ కోహ్లీ తీసుకున్న ఫొటోపై సూర్యకుమార్‌ యాదవ్‌ కామెంట్‌ చేశాడు.

Published : 23 Aug 2023 12:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆసియా కప్‌ 2023 (Asia Cup 2023) మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మినీ టోర్నీ ముగిసిన మూడు వారాల్లోపే వరల్డ్‌ కప్‌ 2023 (World Cup 2023) వచ్చేయనుంది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా ‘రన్‌ మెషిన్‌’ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) సన్నద్ధమవుతున్నాడు.

‘అప్పుడు రోహిత్‌ను ధోని వద్దన్నాడు’

అయితే వెస్టిండీస్‌ పర్యటనలో (WI vs IND) వన్డే (ODI) సిరీస్‌లో విరాట్ ఆడలేదు. తొలి వన్డేలో జట్టులో ఉన్నప్పటికీ బ్యాటింగ్‌కు దిగలేదు. టీమ్‌ఇండియా ప్రయోగాలు చేయడంతో బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఆగస్ట్ 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్‌ లో ఆడనున్నాడు. మినీ టోర్నీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అలాగే మరోవైపు యాడ్‌ ప్రమోషన్లలోనూ పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. అలా.. ఓ కంపెనీ ప్రమోషన్‌ కోసం దిగిన ఫొటోలను విరాట్ భార్య అనుష్క శర్మ (Anushka Sharma) తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. ఈ పోస్టుపై సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) కామెంట్‌ చేశాడు. ‘భయ్యా నీ రన్నింగ్‌ టెక్నిక్‌ కొంచెం బలహీనంగా ఉంది’ అంటూ సరదాగా కామెంట్‌ చేశాడు. ఇదిలా ఉండగా ఈ ఫొటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు