Attack On Prithvi Shaw: అసలు పృథ్వీ షా ఎవరో కూడా నాకు తెలియదు: సప్నా గిల్‌

సెల్ఫీ కోసం (Selfi Row) క్రికెటర్‌ పృథ్వీ షా (Prithvi Shaw)పై దాడికి పాల్పడిన యూట్యూబ్‌ ఇన్‌ప్లూయెన్సర్‌ సప్నా గిల్ (Sapna Gill)ను మూడు రోజుల పోలీసు కస్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే విచారణ సందర్భంగా సప్నా గిల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

Updated : 18 Feb 2023 17:32 IST

ముంబయి: స్నేహితుడితో కలిసి హోటల్‌కు వెళ్లిన టీమ్‌ఇండియా యువ బ్యాటర్ పృథ్వీ షాపై ( Prithvi Shaw) జరిగిన దాడి కేసులో నిందితురాలు సప్నా గిల్‌ను (Sapna Gill) కస్టడీకి ఇస్తూ ముంబయిలోని మెజిస్ట్రేట్‌ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విచారణ సందర్భంగా యూట్యూబర్‌ అయిన సప్నా గిల్‌ తరఫున న్యాయవాది కోర్టులో పృథ్వీ షాకు సంబంధించిన పలు విషయాలను లేవనెత్తినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. మద్యం తాగే అలవాటు ఉన్న షాను బీసీసీఐ (BCCI) గతంలో బ్యాన్‌ చేసిందని కోర్టుకు తెలిపారు. ‘‘కేసు పెట్టకుండా ఉండటానికి రూ. 50 వేలు ఇవ్వాలని సప్నా గిల్  అస్సలు అనలేదు. దీనికి ఎలాంటి ఆధారం కూడా లేదు. సంఘటన జరిగిన 15 గంటల తర్వాత తన స్నేహితుడితో పృథ్వీ షా ఫిర్యాదు చేయించారు. అప్పుడే ఎందుకు కంప్లైంట్‌ చేయలేదు?’’ అని సప్నా గిల్‌ లాయర్‌ వాదించారు.

విచారణ సందర్భంగా సప్నా గిల్‌ కూడా కోర్టుకు విన్నవిస్తూ..   అసలు పృథ్వీ షా అంటే ఎవరో కూడా తనకు తెలియదని పేర్కొన్నారు.   ‘‘నా స్నేహితుడు అతడిని సెల్ఫీ అడిగాడు. అప్పటికీ అతడొక క్రికెటర్‌ అని నాకు తెలియదు. మేం కేవలం ఇద్దరం మాత్రమే ఉన్నాం. పృథ్వీ మాత్రం ఎనిమిది మందితో ఉన్నారు. అతడు భోజనం కోసం వచ్చాడని చెప్పడం.. మేం క్లబ్‌లో పార్టీ చేసుకోవడమంతా అబద్దం. అప్పుడు అతడు మద్యం తాగి ఉన్నాడు. పోలీసులు కూడా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని మమ్మల్ని అడిగారు’’ అని సప్నా కోర్టులో చెప్పినట్లు సమాచారం. వాదనలు విన్న మెజిస్ట్రేట్‌ నిందితురాలు సప్నా గిల్‌ను ఫిబ్రవరి 20వ తేదీ వరకు పోలీసు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. విచారణ అనంతరం సప్నా న్యాయవాది విలేకర్లతో మాట్లాడుతూ.. పృథ్వీ షా చేసినవన్నీ తప్పుడు ఆరోపణలేనని, తమ వాదనను కోర్టులో వినిపించినట్లు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని