Ashwin-Pujara : నువ్వు బౌలింగ్‌ చేస్తే.. నేనేం చేయాలి? పుజారా బౌలింగ్‌పై అశ్విన్‌

నాలుగో టెస్టు (IND vs AUS) చివర్లో పుజారా (Puajra) బౌలింగ్‌ చేయడంపై అశ్విన్‌ (Ravichandran Ashwin) సరదా వ్యాఖ్యలు చేశాడు. దీనికి అంతే సరదాగా పుజారా బదులిచ్చాడు.

Updated : 14 Mar 2023 16:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీ (Border Gavaskar Trophy)లోని ఆఖరి టెస్టు (IND vs AUS) మ్యాచ్‌ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఫలితం తేలేట్లు కనిపించకపోవడంతో ఐదో రోజు చివరి సెషన్‌లో ఛెతేశ్వర్‌ పుజారా, శుబ్‌మన్‌ గిల్‌లతో బౌలింగ్‌ చేయించాడు టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma). వీరిద్దరూ ఒక్కొక్క ఓవర్‌ వేయగానే ఇరు జట్ల కెప్టెన్లు మ్యాచ్‌ను ముగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక పుజారా (Cheteshwar Puajra) బౌలింగ్‌ చేసిన ఫొటోను ట్వీట్‌ చేస్తూ రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin) సరదాగా ట్విటర్‌లో ఓ వ్యాఖ్య రాసుకొచ్చాడు. దానికి పుజారా అంతే సరదాగా బదులిచ్చాడు. వరుస ట్వీట్లతో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇలా సాగింది!

అశ్విన్‌ : నువ్వు (పుజారా) బౌలింగ్‌ చేస్తే.. నేనేం చేయాలి.. నా జాబ్‌ వదులుకోవాలా?(నవ్వుతూ)

పుజారా : కాదు.. ఇది నాగ్‌పుర్‌ టెస్టులో నువ్వు వన్‌ డౌన్‌లో నైట్‌ వాచ్‌మ్యాన్‌గా వచ్చినందుకు కృతజ్ఞతగా చేశా.

అశ్విన్‌ : నీ ఉద్దేశం మంచిదే. అయితే దీన్ని ఎలా కృతజ్ఞత అంటారో అర్థం కావడం లేదు?

పుజారా : బౌలింగ్‌లో నీకు విశ్రాంతినివ్వడం వల్ల.. భవిష్యత్‌లో అవసరమైతే వన్‌ డౌన్‌లో మళ్లీ బ్యాటింగ్‌కి వెళ్లొచ్చు కదా. 

ఇలా ట్విటర్‌లో వీరి మధ్య సరదాగా జరిగిన సంభాషణ.. క్రికెట్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీలో అశ్విన్‌ టాప్‌ వికెట్‌ టేకర్‌ (25 వికెట్లు)గా నిలిచిన విషయం తెలిసిందే. రవీంద్ర జడేజా (22 వికెట్లు)తో కలిసి సంయుక్తంగా ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు అందుకున్నాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని