Ashwin: అశ్విన్‌ ‘ట్విటర్‌ ఖాతా’ కష్టాలు.. పరిష్కరించాలని మస్క్‌కు వేడుకోలు

ట్విటర్ ఖాతా భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) ఏకంగా ఎలాన్‌ మస్క్‌ను ట్యాగ్‌ చేస్తూ పోస్టు పెట్టాడు.

Updated : 15 Mar 2023 15:37 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. ఇంటర్వ్యూలు, వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులతో నిరంతరం టచ్‌లో ఉండేందుకు ఇష్టపడతాడు. బోర్డర్ - గావస్కర్‌ ట్రోఫీ ముగియడంతో అశ్విన్‌కు విరామం దొరికింది. దీంతో ట్విటర్‌లోకి (Twitter) వచ్చేసిన అశ్విన్‌.. తన ఖాతా సెక్యూరిటీపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఎలాన్‌ మస్క్‌కు రిక్వెస్ట్‌ పెట్టాడు.

‘‘నా ట్విటర్ ఖాతాకు సంబంధించి భద్రతపై ఆందోళనగా ఉంది.  తరచూ ఏవో పాప్‌అప్స్‌ (వేరే పేజీకి రీడైరెక్ట్‌ చేసేవి/ సమాచారం అందించేవి) వస్తున్నాయి. ఆ లింక్‌లను క్లిక్‌ చేస్తే ఎలాంటి సమాచారం రావడం లేదు.  అయితే మార్చి 19వ తేదీ వరకు గడువునిస్తూ పాప్‌అప్స్‌ లింక్‌లు కనిపిస్తున్నాయి. కాబట్టి, అప్పటిలోగా నా ఖాతాను ఎలా భద్రంగా ఉంచుకోవాలనేదానిపై మీరు (ఎలాన్‌ మస్క్) చెబితే బాగుంటుంది’’ అని ట్విటర్‌ వేదికగా అశ్విన్‌ పోస్టు చేశాడు. 

ఎలాన్ మస్క్ ‘ట్విటర్ బ్లూ’ను తీసుకొచ్చినప్పటి నుంచి ట్విటర్‌ ఖాతాల నిర్వహణ, భద్రత విషయంలో నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అశ్విన్ చెప్పింది మరో సమస్య. అయితే అశ్విన్‌ ఎదుర్కొంటున్న సమస్య ఏంటనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని