Rajni kanth : భజ్జీ ఛాతి మీద రజనీ.. సూపర్‌స్టార్‌కు స్పెషల్‌ విషెస్‌

ఇవాళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ బర్త్‌డే. ‘తలైవా’కు తమిళనాడులోనే కాకుండా..

Updated : 12 Dec 2021 21:10 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇవాళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ బర్త్‌డే. ‘తలైవా’కు తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖలతో సహా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఇదే క్రమంలో టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ కూడా రజనీకాంత్‌ పట్ల తనకున్న అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నాడు. రజనీకాంత్‌ టాటూను తన ఛాతీ మీద వేయించుకుని మరీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు టర్బోనేటర్. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫొటోను షేర్‌ చేశాడు. 

అంతేకాదండోయ్‌.. రజనీకాంత్‌కు హర్భజన్‌ సింగ్‌ తమిళంలో జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం విశేషం. ‘‘నువ్వు నా హృదయంలో ఉన్నావు సూపర్‌ స్టార్.. 80ల్లో బిల్లావి.. 90ల్లో బాషా.. 2000ల్లో అన్నాత్తె. సినిమా రంగంలో ఒకే ఒక్క సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు’ అని ఇన్‌స్టాలో పోస్టు పెట్టాడు. దీంతో నెటిజన్లు భజ్జీ పోస్టును లైకులు, కామెంట్లతో ముంచెత్తారు. ‘సూపర్‌స్టార్‌కు నిజమైన అభిమాని’.. ‘ఇవాళ్టి రోజును మరిచిపోలేనిదిగా చేశావు. ప్రేమతో శుభాకాంక్షలు తెలిపావు’.. అంటూ కామెంట్లు చేశారు.

సెంచరీ చేశాక సూపర్‌ స్టార్‌ స్టైల్‌లో.. 

విజయ్‌ హజారే ట్రోఫీలో శతకం చేసిన వెంకటేశ్‌ అయ్యర్ (151) సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ స్టైల్‌లో సంబరాలు చేసుకున్నాడు. ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో శతకం, బౌలింగ్‌లో రెండు వికెట్లు పడగొట్టి మధ్యప్రదేశ్‌ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇవాళ సూపర్ స్టార్‌ రజనీకాంత్‌కు విభిన్నంగా శుభాకాంక్షలు చెప్పాలని భావించాడో ఏమో కానీ.. బ్యాటింగ్‌ సందర్భంగా వెంకటేశ్‌ అయ్యర్ చేసిన విన్యాసం భలేగా ఉంది. ఆ వీడియోను కోల్‌కతా నైట్‌రైడర్స్ ట్విటర్‌లో పోస్టు చేసింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని