Shane Warne: షేన్‌ వార్న్‌ ‘బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ’.. ట్వీట్‌ చేసిన ఐసీసీ

అతడు విసిరే బంతి గింగిరాలు తిరుగుతూ మ్యాజిక్ చేస్తుంది. బంతిని అంచనా వేసేలోపే వికెట్లను గిరాటేస్తుంది. బ్యాటర్‌ చేయడానికి ఇంకేం ఉండదు.. క్రీజుని వదిలి వెళ్లిపోవడం తప్ప.. ఈ లెక్కలని చూశాక మనం  మన ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో

Published : 05 Jun 2022 02:34 IST

ఇంటర్నెట్ డెస్క్: అతడు విసిరే బంతి గింగిరాలు తిరుగుతూ మ్యాజిక్ చేస్తుంది. బంతిని అంచనా వేసేలోపే వికెట్లను గిరాటేస్తుంది. బ్యాటర్‌ చేయడానికి ఇంకేమీ ఉండదు. క్రీజుని వదిలి వెళ్లిపోవడం తప్ప.. ఇది ఉపోద్ఘాతం ఎవరి గురించో ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది.. అతడే ఆస్ట్రేలియా స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌. క్రికెట్ చరిత్రలో ఎన్నో మైలురాళ్లను అందుకున్న ఆయన ఈ ఏడాది మార్చిలో అనుమానస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. తాజాగా అతడి బౌలింగ్‌ మాయాజాలాన్ని గుర్తుచేస్తూ ఐసీసీ ఓ ట్వీట్‌ చేసింది.

సరిగ్గా 29 ఏళ్ల క్రితం ఇంగ్లాండ్‌, ఆసీస్‌ మధ్య జరిగిన యాషెస్‌ సిరీస్‌లోని ఓ టెస్టు మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో షేన్‌ వార్న్‌ అద్భుతమైన బంతితో ఇంగ్లాండ్‌ ఆటగాడు మైక్‌ గాటింగ్‌ను బోల్తా కొట్టించాడు. ఆ బంతి లెగ్‌స్టంప్‌ ఆవల పడటంతో వైడ్‌ అవుతుందని భావించి బ్యాటర్‌ దానిని వదిలేశాడు. కానీ, అది ఒక్కసారిగా గింగిరాలు తిరుగుకుంటూ ఆఫ్‌ స్టంప్‌ని గిరాటేసింది. దీంతో ఆటగాడితోపాటు అంపైర్‌ కూడా బిక్కమొహం వేశారు. ఈ బంతిని ‘బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ’గా పేర్కొంటూ అప్పట్లో వార్న్‌పై ప్రశంసల వర్షం కురిసింది. ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తూ ఐసీసీ తాజాగా ట్వీట్‌ చేసింది. ‘1993.. సరిగ్గా ఇదే రోజు.. ప్రపంచం షేన్‌ వార్న్‌ బాల్‌ ఆఫ్‌ ది సెంచరీని చూసింది’ అని షేన్‌ వార్న్‌ను గుర్తు చేస్తూ ట్వీట్‌ చేసింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని