Virat - Rohit: విరాట్, రోహిత్‌.. టీ20ల్లో వీరిద్దరిలో ఒక్కరినైనా ఆడించాలి: పాక్‌ దిగ్గజం

ప్రస్తుత భారత క్రికెటర్లలో విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit sharma) సీనియర్లు. అయితే ఇటీవల కొన్ని టీ20 మ్యాచుల్లో వీరిద్దరూ లేకుండానే భారత్‌ మ్యాచ్‌లను ఆడుతోంది. 

Published : 30 Jan 2023 01:19 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గతేడాది పొట్టి ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 మ్యాచ్‌లను ఆడటం లేదు. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ యువకులకు ఎక్కువగా అవకాశాలు ఇస్తూ వస్తోంది. హార్దిక్‌ పాండ్య నాయకత్వంలో ‘మిషన్ 2024’ కోసం టీమ్‌ఇండియా సమాయత్తమవుతోంది. అయితే సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను టీ20ల్లో ఆడించాలని పాక్‌ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ సూచించాడు. 

‘‘కేఎల్ రాహుల్ వంటి ఆటగాడికి ప్రత్యామ్నాయం వెతకడం సులువే. కానీ రోహిత్, కోహ్లీ వంటి ఆటగాళ్లకు రిప్లేస్‌మెంట్‌ చేయడం కష్టం. శుభ్‌మన్‌ గిల్, పృథ్వీ షా, ఇషాన్‌ కిషన్ మంచి ఆటగాళ్లే. భవిష్యత్తులో స్టార్‌ ప్లేయర్ల స్థానాలకు ఎదగగలరు. అయితే వీరంతా ఒకే తరహా ఆటగాళ్లు. ఒకే అనుభవం ఉంది. వీరు వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌కు జట్టును తీసుకెళ్లగలరా..? ఆటపరంగా అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నాయి. కానీ అనుభవలేమి అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ప్రపంచకప్‌వంటి మెగా టోర్నీల్లో అనుభవం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. న్యూజిలాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌నే ఉదాహరణగా తీసుకోండి.. వీరంతా యువకులకు కావడంతో సీనియర్‌ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఒకవేళ సీనియర్లు రోహిత్, విరాట్.. ఇలా వారిలో ఒక్కరు ఉన్నా సరే ఫలితం మరోలా ఉండేది.  అందుకే రాహుల్ ద్రవిడ్, హార్దిక్‌ పాండ్యకు నేను సూచించే విషయం ఒక్కటే. రోహిత్, విరాట్‌కు అవకాశం కల్పించాలి. కనీసం వీరిద్దిరిలో ఒక్కరినైనా తుది జట్టులో ఆడించాలి’’ అని లతీఫ్ వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు