World Boxing Championship: ప్రపంచ మహిళ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌.. భారత్‌కు మరో స్వర్ణం

ప్రపంచ మహిళ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ మరో స్వర్ణం సాధించింది. 81 కిలోల విభాగంలో స్వీటీ బంగారు పతకాన్ని ముద్దాడింది.

Updated : 25 Mar 2023 21:17 IST

దిల్లీ: ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ (World Boxing Championship)లో భారత్‌ మరో స్వర్ణం సాధించింది. బాక్సింగ్‌ 81 కిలోల విభాగంలో హరియాణాకు చెందిన స్వీటీ బూరా బంగారు పతకాన్ని అందుకుంది. ఫైనల్లో చైనాకు చెందిన వాంగ్‌ లినాపై 4-3 తేడాతో విజయం సాధించి పసిడిని ముద్దాడింది. 2014లో ఫైనల్‌లో ఓడి రజతంతో సరిపెట్టుకున్న 30 ఏళ్ల స్వీటీ... ఈ సారి పట్టుదలతో పసిడిని ఒడిసి పట్టింది. అంతకుముందు సెమీస్‌లో ఆస్ట్రేలియాకు చెందిన ఎమ్‌వా నుంచి కఠిన సవాల్‌ ఎదుర్కొన్న స్వీటీ.. తాజాగా 4-3 తేడాతో విజయం సాధించింది.

ఇప్పటికే 48 కిలోల విభాగంలో నీతూ గాంగాస్‌ను పసిడి వరించిన విషయం తెలిసిందే. నీతూ ఫైనల్‌లో మంగోలియాకు చెందిన లుత్సాయిఖాన్‌పై 5-0 తేడాతో విజయం సాధించింది. భారత్‌కు చెందిన మేరీకోమ్‌ (ఆరుసార్లు), సరితా దేవి, జెన్నీ ఆర్‌ఎల్‌, లేఖ కేసీ, నిఖత్‌ జరీన్‌ ఇప్పటి వరకు ప్రపంచ ఛాంపియన్లుగా అవతరించగా.. ఇప్పుడు ఆ జాబితాలో నీతూ, స్వీటీ కూడా చేరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు