One8 Commune: విరాట్‌ ‘వన్‌8’ రెస్టారెంట్లపై ఆ ఆరోపణలు సరికాదు: యాజమాన్యం

తమపై వచ్చిన లింగవివక్ష ఆరోపణలను వన్8 కమ్యూన్‌ రెస్టారెంట్‌ ఖండించింది. స్వలింగ సంపర్కులు....

Updated : 30 Aug 2022 12:27 IST

దిల్లీ: తమ అవుట్‌లెట్లపై వచ్చిన లింగవివక్ష ఆరోపణలను వన్8 కమ్యూన్‌ రెస్టారెంట్‌ ఖండించింది. స్వలింగ సంపర్కులు, గే కమ్యూనిటీ సభ్యుల ప్రవేశంపై వివక్ష చూపుతోందని ‘యస్‌వుయ్‌ఎగ్జిస్ట్‌ ఇండియా’ గ్రూప్‌ సభ్యులు ఆరోపించారు. పుణెలోని వన్‌8 కమ్యూన్‌ రెస్టారెంట్ అవుట్‌లోకి స్త్రీ-పురుష, సాధారణ మహిళలను మాత్రమే అనుమతిస్తున్నారని విమర్శించారు. రెస్టారెంట్‌కు సంబంధించిన ఇతర శాఖల్లోనూ ఇదే వివక్ష కొనసాగుతుందని పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను ఖండించిన రెస్టారెంట్ యాజమాన్యం.. ఎలాంటి లింగబేధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఆతిథ్యం ఇస్తున్నామని తెలిపింది. ‘మా రెస్టారెంట్ నిబంధనలనుబట్టి మేం మొదట్నుంచి అందరికి మా సేవలను అందిస్తున్నాం. ఎల్లప్పుడూ కలుపుకొని వెళ్తున్నాం’ అని పేర్కొంది. పారిశ్రామిక నిబంధనల మేరకే తమ నియమాలు ఉంటాయని స్పష్టం చేసింది. అందులో భాగంగానే ఎవరికి అనుమతి ఇవ్వాలి, ఎవరిని అనుమతించకూడదనే నిబంధనలను పెట్టుకున్నట్లు వెల్లడించింది.  

LGBTQIA+ గ్రూప్‌ అడిగిన ప్రశ్నకు రెస్టారెంట్ యాజమాన్యం సామాజిక మాధ్యమం ద్వారా సమాధానం ఇచ్చింది. స్వలింగ సంపర్కులు, ఇలాంటి గ్రూప్‌ సభ్యులకు రెస్టారెంట్‌లోకి అనుమతి లేదని తెలిపింది. ట్రాన్స్‌జండర్‌ మహిళలను వారి దుస్తులను బట్టి అనుమతినిస్తామని పేర్కొంది. అందుకోసమే తమ పాలసీల గురించి ఎవరూ తప్పుగా అర్థం చేసుకోకూడదని, తమమీద తప్పుడు ముద్ర వేయకూడదని కోరుతున్నట్లు తెలిపింది. భారత క్రికెటర్‌ విరాట్ కోహ్లీకి చెందినవే వన్‌8 కమ్యూన్ చైన్‌ రెస్టారెంట్లు. దీంతో నెట్టింట్లో ఒక్కసారిగా వైరల్‌గా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని