Riyan Parag:ఆ స్థానంలో ధోనీ ఒక్కడే నంబర్ వన్: రియాన్ పరాగ్
రియాన్ పరాగ్ భారత టీ20 లీగ్‌లో గత నాలుగేళ్లుగా రాజస్థాన్ జట్టుకు ఆడుతున్నాడు. మొదటి రెండు సీజన్లలో దూకుడుగా ఆడి మంచి హిట్టర్‌గా గుర్తింపు సంపాందించుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: రియాన్ పరాగ్ భారత టీ20 లీగ్‌లో గత నాలుగేళ్లుగా రాజస్థాన్ జట్టుకు ఆడుతున్నాడు. మొదటి రెండు సీజన్లలో దూకుడుగా ఆడి మంచి హిట్టర్‌గా గుర్తింపు సంపాందించుకున్నాడు. అయితే, గత చివరి రెండు సీజన్లలో అతడు ఆశించినమేరకు రాణించలేదు. ఎక్కువగా ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగే పరాగ్ 2022 సీజన్లో 18 మ్యాచ్‌ల్లో 138.64 స్ట్రైక్‌రేట్‌తో 183 పరుగులు చేశాడు. అయినా, అతడిపై రాజస్థాన్ నమ్మకం ఉంచి వచ్చే సీజన్ కోసం రిటైన్ చేసుకుంది. ఈ నేపథ్యంలోనే చివర్లో బ్యాటింగ్‌కు దిగి.. వచ్చిరాగానే దూకుడు ఆడటం గురించి మాట్లాడాడు 21 ఏళ్ల రియాన్ పరాగ్.
‘టీ20 క్రికెట్లో క్రీజులోకి వచ్చిరాగానే దూకుడుగా ఆడటం కష్టతరమైన పని. ఈ ఫార్మాట్లో బ్యాటింగ్ చేయడానికి ఆరు, ఏడు స్థానాలు చాలా కఠినమైనవి. కొంతమంది మాత్రమే ఈ స్థానాల్లో వచ్చి దూకుడుగా ఆడగలరు. నేనైతే కేవలం ఎం.ఎస్. ధోనీ మాత్రమే ఇందులో ప్రావీణ్యం సంపాదించాడని చెప్తాను. నా కెరీర్ ఆరంభ దశలోనే ఈ పాత్రని పోషిస్తున్నా. నేనింకా దీంట్లో ప్రావీణ్యం సంపాదించలేదు.. ఇప్పుడే నేర్చుకుంటున్నా. ప్రజలు వారికి ఇష్టం వచ్చింది మాట్లాడుతారు. కానీ, ఇదెంత కఠినమైన పాత్రో నాకు తెలుసు. నా టీమ్ నన్ను నమ్ముతోంది. గత నాలుగేళ్లుగా నాకు మద్దతుగా నిలుస్తోంది. నాకిది ఐదో సంవత్సరం. జట్టు నాపై ఉంచిన నమ్మకానికి నా ఆటతీరుతో ప్రతిఫలం ఇస్తా’ అని రియాన్ పరాగ్ పేర్కొన్నాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TTD: తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు .. భారీగా తరలివచ్చిన భక్తులు
-
Movies News
Chiranjeevi: ఆ మార్క్ చేరుకోవడం ఆషామాషీ కాదు: చిరంజీవి
-
India News
Gauhati HC: ‘జీన్స్’తో కోర్టు విచారణకు.. సీనియర్ న్యాయవాదికి ఊహించని అనుభవం!
-
Politics News
Andhra News: కార్పొరేట్ కంపెనీలా వైకాపా వ్యవహరం: సోము వీర్రాజు
-
Sports News
Gill - Pant: భవిష్యత్తులో కెప్టెన్సీకి వారిద్దరూ అర్హులు: ఆకాశ్ చోప్రా
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు