మహిళల క్రికెట్‌కు మంచి రోజులు: నీతా అంబానీ

మన దేశంలో మహిళా క్రికెట్‌కు రానున్న రోజులు గొప్పగా ఉండనున్నాయని రిలయన్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ అన్నారు. ఇండియా ఉమెన్స్‌ క్రికెట్‌ భవిష్యత్తుపై తాను ఆశావాద దృక్ఫథంతో ఉన్నట్లు ఆమె

Published : 11 Nov 2020 01:57 IST

దుబాయ్‌: మన దేశంలో మహిళా క్రికెట్‌కు రానున్న రోజులు గొప్పగా ఉండనున్నాయని రిలయన్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండియా ఉమెన్స్‌ క్రికెట్‌ భవిష్యత్తుపై తాను ఆశావాద దృక్ఫథంతో ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. యూఏఈలో జరుగుతున్న టీ20 లీగ్‌లో ఫైనల్‌ చేరిన తన ముంబయి జట్టు అధికారిక ట్విటర్‌ ఖాతాలో సోమవారం నీతా అంబానీ వీడియో పోస్ట్‌ చేశారు. అందులో మహిళా క్రికెట్‌పై ఆమె మాట్లాడారు. టీంఇండియా ఉమెన్స్‌ జట్టులోని అమ్మాయిలు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అద్భుతంగా రాణిస్తున్నారని తెలపారు.

ప్రపంచ వేదికలపై మన అమ్మాయిలు మెరుస్తున్నారని పేర్కొన్నారు. గత ఆరేళ్లలో వన్డే, టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో మన జట్టు ఆధిపత్యం చెలాయించిందని నీతా అంబానీ అన్నారు. అంజుమ్‌ చోప్రా, జులన్‌ గోస్వామి, మిథాలీ రాజ్‌ వంటి లెజెండ్స్‌ మహిళా క్రికెట్‌కు మార్గదర్శకులుగా నిలిచారని ఆమె వివరించారు. ప్రస్తుతం స్మృతి మంథాన, పూనమ్‌ యాదవ్‌, హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ జట్టును ముందుకు తీసుకెళ్తారని నీతా అంబానీ పేర్కొన్నారు. యూఏఈలో జరుగుతున్న ఉమెన్స్‌ టీ20 లీగ్‌లో  సోమవారం ఫైనల్‌ మ్యాచ్‌ సూపర్‌ నోవాస్‌, ట్రయల్ బ్లేజర్స్‌కు మధ్య జరిగింది. ఈ నేపథ్యంలో నీతా అంబానీ మన దేశ మహిళా క్రికెటర్ల గురించి మాట్లాడారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో స్మృతి మంథాన సారథ్యంలోని ట్రయల్ బ్లేజర్స్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. 

 

 

 


  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని